పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్లూటార్కు

7


నిని మన్నింపవలెను. గురువువలెనె నతనికి స్వప్నములయందు నమ్మకము కలదు; వాని యాధార్థ్యమును జెప్పలేము. రెండుపక్షములలోఁ దగు కారణము లగుపడుచున్నవి.

ఆ కాలములో ముద్రాక్షరశాలలు లేవు; ముద్రింపఁబడిన పుస్తకములు లేవు. అన్నియు లిఖితరూపముగనున్న గ్రంథములు. "వానిని వ్రాయుట కష్టము. వ్రాయఁబడినవానిని కొనుట కష్టతరము. సంపాదించిన వానిని జదువుట కష్టతమము. అట్టి స్థితిలో, ఫ్లూటార్కు చదివిన గ్రంథములకు లెక్క లేదు. 'కావ్యాలాపవినోదేన కాలో గచ్ఛతి ధీమతాం.”

అతని కుటుంబమువారు ధనము లేనివారుకారు. ఆతని పూర్వులు పెద్ద యుద్యోగములఁ జేసినవారు. ప్రపితామహుని బాగుగ నతఁడెఱుఁగును. ఇతని కాలములో స్వదేశీయులు 'రోమనుల' దాడి భరింపలేక శ్రమపడి రని ఫ్లూటార్కు వ్రాసి యున్నాఁడు. అతని పితామహుఁడు సంతోషపురుషుఁడు; మంచి వక్త: మద్యపానాపేక్షుఁడు; రసములోనికి వెళ్ల, సరసము బయటకు వచ్చుచుండెను. అతని తండ్రికూడ ధర్మాత్నుఁడు, సుగుణ వంటఁడు. ఆ కాలపు చదువుల నతఁడు బాగుగఁ జదివెను. తండ్రినిగుఱించి చెప్పుచు, “ నేను మఱియొకనితోఁ గలిసి సందేశముమీఁద నొక గ్రామమునకుఁ బంపఁబడితిని. నాతోడవచ్చిన వాఁడు మార్గములోనుండి పోయినందున, నొంటరిగ నేనాగ్రామమునకుఁబోయి, యా సందేశమును నెరవేర్చి, స్వగ్రామ