పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


హింసించిన, వాని రూపమును బొందవలసివచ్చు నని ప్రజలకు బోధించెను.

'కేటో'యొక్క జీవితమును వ్రాయుచు, “అతఁడు (Cato) పరిచారకులను పశువులవలెఁ జూచుచుండెను; వారిని తోఁచినపుడెల్ల బానిసలుగఁ జూచుచుండెను; కొన్ని వేళల వారిచేత బరువులను మోయింపించెను; కొన్ని సమయములలో వారిని బయటకు వెళ్లఁగొట్టి వారి కాహారమిడుట లేదు. సృష్టిలో మనుజుఁడు రాజు గనుక, మనుజులను సోదరభావముతోఁ జూచుటయేగాక, యితర జంతువులసహిత మతఁడు ప్రేమించవలెను. అన్ని జంతువులను సమభావముతోఁ జూచుటయే పరమమతము” అని ప్లూటార్కు తన మనోభిప్రాయమును విశదపఱచెను. గురూపదేశమున కనుగుణ్యముగ నతఁడు నడిచెను.

పాఠశాలలలో గురువు లుపన్యసించు అస్పష్ట పరిభాషణములను, వీరమతస్థుల పిచ్చికూతల నతఁడు తిరస్కరించి, పైథాగొరాసు శాస్త్రమును ప్రకృతితో సమ్మేళనఁజేసి, జ్ఞానోదయమగునట్లు చేసెను. పారసీకము, ఈజిప్టు దేశములలోని శాస్త్ర,ములను శోధించినందున, నతనిని జ్ఞానియని స్వదేశీయులు బిలువఁ దలఁచినపుడు, దాని కంగీకరించక 'శాస్త్రజిజ్ఞాసకుఁ'డని పిలువఁబడుట కతఁడు సమ్మతించెను.

గురువులయొక్క సదభిప్రాయములనెగాక, వారి దురభిప్రాయములనుగూడ ఫ్లూటా ర్కవలంబించినందుకు మన మత