పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెమిస్టాకిలీసు

171


గాలముగాదని, వీరిరువు రేకమైరి. వీరి సలహాపైని, నౌకాహవముఁ జేయుటకు గ్రీకులు సమ్మతించిరి. అందుకు శుభశకునము లగుపడెను. సముద్రముమీఁద వారుండిన స్థలమున యుద్దము. జరిగిన, వారు జయము నొందుదు రని వారితో థెమిస్టాకిలీసు చెప్పెను. మొదట వారందుల కంగీకరించిరి గాని, శత్రువుల యోడలను జూచినపైని, వారి కధైర్యముగలిగెను. పారసీకుల యోడ లొక వెయ్యియుండె; వీరివి నూటయెనుబదిమాత్ర ముండెను. అందుచేత స్పార్టనులు రాత్రి రాత్రియే బయలుదేరి వారి దేశమునకుఁ బోవలెనని సిద్ధముగనుండిరి. -

గ్రీకులలో నెవరు వెళ్లిపోయినను దేశమునకు ముప్పు వచ్చు నని థెమిస్టాకిలీసు ఎంచి వారితో నెంతచెప్పినను స్పార్టనులు వినరైరి. మాటలతో గార్యములేదని తలఁచి, తన యొద్దనున్న పారసీకపు మునిషీని పిలిచి "నీవు చక్రవర్తిక్షారుని వద్దకుఁబోయి, గ్రీకులు పారిపోవఁ దలఁచినారు. వారు పారిపోకుండునటుల పారసీకుల యోడలను నాలుగువైపుల'కాపుంచుమని యతనితోఁ జెప్పిరమ్మ”ని చెప్పిపంపెను. ఆప్రకారము మునిషీ చక్రవర్తియొద్దకుఁ బోయి, చెప్పెను. శత్రువుల యోడలు క్షణములో నాలుగువైపు లాక్రమించెను. గ్రీకులు పారిపోవుటకు వీలులేకపోయెను.

మరుసటిదినము సూర్యోదయము కాఁగానె, సముద్రముమీఁద యుద్ధ మారంభమయ్యెను. గ్రీకుల పడవలు తేలి.