పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


కయినవి; శత్రువులవి, బరువు. వారు వానిని సుళువుగ గడిపిరి; గడుపుటకు వీరు కష్టపడిరి. వీ రుభయులు యుద్ధముచేసినచోటు సముద్రములోఁ ప్రదేశ బోటుఎక్కువ. శత్రువులు గాలికి యెదురుగ వారి నావలను గడపవలసివచ్చెను. కొండ చరియపైని యొక రత్న సింహాసనముమీఁద చక్రవర్తి గూర్చుండెను. అతనినిచుట్టి చరిత్రకారు లుండిరి. యుద్ధ మారంభమయ్యెను. ఇరుతెగలవారు మోటుగ పోరాడిరి. సాయంకాలమువఱకు పోరాటము జరిగెను. పారసీకు లోడిపోయిరి.

"పారసీకులు జలసంధిమీఁద కట్టిన పడవల వంతెన విరుగఁగొట్టి, వారిని సంహరించుట మే”లని థెమిస్టాకిలీసు చెప్ప, “ఇదివఱకు వారేమి చేయుదు రోయను భయముతోనుంటిమి. ఇప్పుడు వారు మన దేశమునుండి తరలిపోవు మార్గము చూడవలెను గాని, నీవు చెప్పిన ప్రకారమైన, వారు మన దేశములోనే యుండి, మనలను మఱింత పీడింతు"రని ఆరిస్టైడీసు సలహాచెప్పెను. పడవలవంతెనను విరుగఁగొట్టుటకు గ్రీకులు సిద్ధముగ నుండి రను మాటను చక్రవర్తివిని, సైన్యముతో శీఘ్రముగ బయలుదేరి దేశము విడిచిపోయెను. వైజయంతికమహోత్సవములు గ్రీకులు సలిపిరి. వారి వారి స్వదేశములకు అందఱును వెళ్లిపోయిరి.

ఆ సంవత్సరము జరిగిన 'ఒలింపికు' క్రీడలలో, థెమిస్టాకిలీసుకు వీరకిరీటమును గ్రీకు లిచ్చిరి. అక్కడకు వచ్చినవా