పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


తాటికాయలవలె వ్రాలుచుండెను. అంతలో గ్రీకులలో నొకఁడు పారసీకులకు కనుమలోని రెండవమార్గమును జూపి ,, వారి సైన్యమును త్రోవదప్పించి నందున, స్పార్టనులు రెండు వాహినులచేత నొక్కఁబడి వీరస్వర్గము నొందిరి. సేనాధిపతికూడ రణములోఁబడెను.

ఈ యపజయము గ్రీకులు వినిరి. చక్రవర్తి 'క్షారుఁడు. ఫౌఁజులను నడిపించుకొనివచ్చెను. గ్రీకులకు వ్యవధిలేదు; ఏమిచేయుటకు తోఁచదయ్యె; బంధుమిత్రవర్గంబులను, గృహములను విడిచిపోలేరు: పట్టణములోనుండిన, మరణము నిశ్చయము. అప్పుడు థెమిస్టాకిలీసు ఇచ్చిన సలహాపైని యా బాల గోపొలము పడవల నెక్కిరి. స్త్రీ బాల వృద్దు లొక ద్వీపమునకుఁ బంపఁబడిరి, కరువు, దారిద్ర్యము, బంధువియోగము, శత్రుధాటియు వారికొక్కమారె కలిగెను. అథీనియనులు గంట నీరు పెట్ట లేదు. పట్టణ మశేషము నిర్జన మయ్యెను. .

శత్రువు వచ్చి యెదుట నిలిచియుండెను. గ్రీకులు వారిలో వారు గ్రుద్దులాడుచుండిరి. అథీనియనులా, స్పార్టనులా — వీరిలో నెవరు యుద్ధములో ముందునడువవలె నని వారు వాదులాడిరి. "ఎవరు నడిచిననేమి? "దేశము శత్రువునకు స్వాధీనమై, మనము వానికి లోఁబడకూడ"దని థెమిస్టాకిలీసు బుద్దిచెప్పెను. దేశోచ్చాటన చేయఁబడినవారు, ఉత్తరువైనందున, వచ్చి చేరిరి. ఆరిస్టైడీసు గూడవచ్చెను. కలహమునకుఁ