పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


వెళ్లు సంవత్సరము వచ్చెను. నగరమంతట దీనాలాపములు నిండె; ప్రజ లా బాలవృద్ధులు ముకుళితముఖారవిందు లయిరి; వారి ముఖమున కత్తివేటుకు రక్తము లేకుండెను.

అప్పుడు థెసియసు వారి దుఃఖము వాషి, వారితో తాను వెళ్లుటకు తండ్రి యనుమతిఁబొందెను. అతనితోఁ గూడి యేడుగురు బాలురు కన్యకలు పడవనెక్కి, ద్వీపమునకుఁ బోయిరి. ఆ దీవికి రాజైన 'మినాసు' యొక్క సేనాధిపతిని యతఁడు ముందు జంపెను. అటుపైని కొన్ని గరిడీ విద్యలు జరిగెను. వానిలో సతఁడు తన ప్రావీణ్యతను గనఁబఱచెను. అప్పుడు రాజుకూఁతురు 'ఆర్యాదిని', యతని దేహలానణ్యమునకు మెచ్చి యతనిని మోహించెను. -

ఆమె వర్తమానము పంపినందున, నతఁ డామె సమక్షమునకుఁబోయెను. పద్మవ్యూహమువలె, నల్లుకొనియున్న యరణ్యములో నా రాక్షనుఁడు నివసించియుండు నని యామె యతనితోఁ జెప్పెను. ఆమె యొక దార మతని చేతికిచ్చి, దానిని పట్టుకొని యరణ్యములోఁ బ్రవేశించి, వానిని జంపి రావలసిన దని చెప్పిపంపెను. అతఁ డాప్రకారము వ్యూహములోనికిఁ బోయి యా రాక్షసుని రూపుమాపి, దారము నల్లుకొనుచు వచ్చి, 'ఆర్యాదిని' సమక్షముఁ జేరెను. అక్కడివా రందఱు ముదమందిరి.

బాలికాబాలురతో నతఁడు పడవ నెక్కి, స్వనగరము