పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెసియసు

165


నకు బయలుదేరెను. తొందరలో వారు జయధ్వజమును పడవమీఁద నెత్తలేదు. అందుచేతఁ గుమారుఁడు మృతినొందెనని యెంచి, 'ఆజియసు' కొండమీఁదనుండి సముద్రములోనికి దుమికి చనిపోయెను. అనంతరము థెసియసు రేవులో దిగెను. నగరవాసు లంద ఱతనిని వేనోళ్ల పొగడి వీరజయోత్సవములను జరిపిరి. తదుపరి, పితృవియోగమునకు దుఃఖంచి, ప్రేత కార్యముల నతఁడు యథావిధిగా జరిపెను,

అనంతర మతఁడు రాజ్యమునకు వచ్చెను. ఇంతకుఁ బూర్వము ప్రజలందఱుఁ జెల్లాచెదరుగ గృహములు కట్టుకొని నివసించుచుండిరి. అందుచేత నతఁడు వారిని సమావేశము చేసి, యొక పట్టణము నిర్మించెను. ఆ పట్టణమె 'ఆథెన్సు'. మనో దేహబలములుగలవాఁడు గనుక, థెసియసునె సేనాధిపతిగ ప్రజలు నియమించిరి, ప్రజలందఱు సమావేశమై, వ్యవహారములను బరిశీలించుటకుఁ దగిన 'ప్రజామందిరము” నొకటి నిర్మింపించిరి. సామంతు లని, కృషీవలు లని, వర్తకు లని వ్యావహారిక భేదములు తప్ప, జాతి భేదములు వారిలో లేవు. ప్రజలందఱు సమానులె. అందఱియెడల నొకటే దండనీతి ప్రవర్తించుచుండును. వేషభాషలలోను, మతాచారములలోను వారు సమానులే,ఆటపాటలలోను భేదము లేదు. వారికి కావలసిన సాంఘికసూత్రముల నేర్పాటుచేసి, రాజ్యమును స్థాపించి, థెసియసు స్వర్గస్థుఁడయ్యెను.