పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెసియసు

163


యసు సవతికుమారుఁడని చారులవలన దెలిసికొని, కుమారుఁడని భర్త గ్రహించకమునుపె, యతనికి విందుచేసి, విషము పెట్టి చంపవలె నని 'మీడియా' యత్నించెను. అతఁడు తండ్రి గృహములోఁ బ్రవేశించెను. ఆనాఁ డొక విందు జరుగుచుండెను. ఎవఁడో గొప్పవాఁడు వచ్చినాఁడని తలంచి, థెసియసును రా జాహూయము చేసెను. తనపేరు చెప్పుకొనక, తండ్రి చూచునటుల చంద్రాయుధమును బట్టుకొని, యతఁడు కూర్చుండెను. ఇంతలో 'మీడియా' విషమును గలిపి, మద్యపాత్రను భర్తచేతి కిచ్చి, వచ్చినవాని కియ్యవలసిన దని కోరెను. రాజు దానిని బట్టుకొని, ప్రక్కకు దిరుగుసరికి, చంద్రాయుధ మతని కంటపడెను. వెంటనే, దానిని ధరించినవాఁడు తన కుమారుఁడని యతఁడు గ్రహించి, సంతోషముచేతఁ బరవశుఁడై, పాత్రను జారవిడిచెను. రాజు కుమారుని గొఁగిలించుకొని, శరీరము దువ్వి, శిర మాఘ్రాణించి, యానందబాష్పములతో నతని శరీరమును దడిపెను.

'క్రీటు' ద్వీపములో 'మినోతారుఁ'డను రాక్షసుఁ డొకఁ డుండెను. వాని యూర్ధ్వభాగము వృషభాకారము; అథోభాగము మానవాకారము. తొమ్మిది సంవత్సరముల కొకపర్యాయము 'అథీనియను' లేడుగురు బాలురను, ఏడ్వురు కన్యలను, కానుక దీసికొని వెళ్లు టాచారము గలదు. ఆ రాక్షసుఁడు వీరినిఁ జంపి తినుచుండును. ఈ కానుకను దీసికొని