పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


బడక, ప్రయాణమును సాంతముగ జేసినవారులేరు. ఈ సంగతులు విని, పరాక్రమశాలి గనుక, మార్గములు నిష్కంటకములు చేయవలెనని కోరి, యతఁడు నాటున బయలు దేరెను. "రక్తములో దడిసిన యాయుధమును జూచిన తండ్రి సంతసించును గాని, తెల్లగ థళథళలాడుచున్న దానినిజూచి యతఁ డామోదించునా?" యని తాతగారితోను తల్లితోను జెప్పి యతఁడు బయలు దేరిపోయెను.

మార్గములో 'పెరి ఫేటీసు' అను పేరుగల యొక ముష్కరుఁడుండెను. వీఁడు గదాయుద్ధములోఁ బ్రసిద్ధికెక్కినవాఁడు. వీనితో నతఁడు గదాయుద్దముఁ జేసి, చంపి, వీని గదను బట్టుకొని, యక్కడినుండి బయలుదేరెను. అనంతరము, దేవదారువృక్షమును వంచినవాఁ డని పేరుపొందిన పురుషునిఁ బోరాటములోఁ దునుమాడి, వాని కూఁతురును సంతోష పఱచి, యతఁ డా స్థలమును విడిచిపోయెను. తదుపరి, 'మగారా' పొలిమేరనున్న యొక దొంగను బట్టుకొని, వాని నతఁడు కొండమీఁదినుండి క్రిందికిఁ ద్రోసి చంపెను. 'ఎడ్యాసిసు' అను గ్రామములో నొక మల్లుని నోడించి, వాని నతఁడు యమ మందిరమునకుఁ బంపెను.

'ఆజియసు' 'మీడియా' యను నామెను వివాహమాడి, ఆథెన్సునగరములోనుండెను. 'థెసియసునగరములోఁ బ్రవేశించి, తండ్రిదర్శనమునకు వెంటనే వెళ్లలేదు. థెసి