పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


డెప్పుడు నిర్లిప్తతతో నుండెను. అంతశ్శత్రువుల నతఁడు జయించెనని వేఱె చెప్పనేల? ఆ కాలములో గుణముల సొబగులేక, యడవి మనుజులవలె మోటరులైన రోమకుల నరికట్టి వారిని సన్మార్గములోనికి దెచ్చి, నయమున భయమున వారికి హితోపదేశ మతఁడు చేసెను. రాజకీయవ్యవహారములను నిర్వర్తింపని కాలములో విషయసుఖములయందు మనస్సును ప్రవర్తింపనీయక, దేవతారాధనలయందు నిశ్చలభక్తితోఁ గాలమును గడుపుచుండెను; కాలమును గుఱ్తెఱిఁగి, యా ముష్మికచింతతో నుండెను. రోమ్యులనుతోఁ గలిసి రాజ్యభారమును వహించిన 'తాతియసు' అనువాఁడు నూమా సుగుణసంపదకు మెచ్చి తన కూఁతురు 'తాతియా' నతని కిచ్చి వివాహము చేసెను. ఏకాంతస్థలములో నొడుదొడుకులు లేక నిశ్చింతతో భర్తతోఁ గలసి కాపురముఁజేయుట కామె సమ్మతించెనుగాని, యైహికభోగముల ననుభవించుచు పితృగృహమున నుండుట కామె యిష్టపడలేదు. పదమూఁడు సంవత్సరములు కావురముఁ జేసి, యామే దివి కేగెను.

అనంతరము నూమా వనముల కేగెను. అచ్చట, 'అగీరియా' యను దేవత యతనికి ప్రసన్నమయ్యెను, ఆమె యతనిని ప్రేమించి, సమస్త విద్యల నతని కొసఁగెను, ఆ దేవియొక్క ప్రసన్నత గలిగియుండ, నితర వ్యాపారములలో నతని మన స్సెటుల గలీనమగు? ఇటు లతఁడు గాలము గడుపుచుండ,