పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



నూమా

'రోము'నగరమును స్థాపించి, సాంఘికసూత్రము లేర్పఱచి రాజ్యతంత్రములను నిర్మించి ప్రజలకు రణశిక్షను నేర్పిన మహాపురుషుఁడు 'రోమ్యులను'. ఆ నగరము మొదట నేక రాజ్యాధిపత్యములోనిది; అచ్చట రాజ్యమేలినవారిలో మొదటివాఁడు 'రోమ్యులను'. ఇతఁడు దేవాంశసంభూతుఁడు; ఇతఁడు గొంతకాలము పరిపాలనజేసి స్వర్గస్థుఁడయ్యెను. అనంతరము 'సెనేటు'సభవారు రోజు కొకరుచొప్పున వంతువేసికొని రాజ్యమును బరిపాలించుచుండిరి. నగరవాసులు 'రోమకు'లని 'సాబీను'లని రెండు తెగలవారు. వారంద ఱేకీభవించి, యొకనిని రాజుగ నేర్పఱచవలసిన దని సభవారిని గోరిరి. అప్పుడు 'సాబీను'లలోనివాఁడైన 'నూమా'ను వారు రాజుగఁజేసిరి. అతఁడు రెండవరాజు,

తండ్రికి గలిగిన కుమాళ్లలో నతఁడు నాలుగవవాఁడు. అతఁడు యేప్రిలు 21 తేదీని పుట్టెను. ఆ దినము రోము నగరమునకు శంకుస్థాపనఁజేసిన దినము. మొదటినుండి, ధర్మమునందె యతని బుద్ది ప్రసరించెను; త్రిగుణాతీతుఁడై, యతఁ

153