పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టైబీరియసు - గ్రాకసు

137


చట్ట మేర్పడెను. ఇందుమూలమున సామంతులు కొంతవఱకు లొంగి తిరుగుటకు వీలుపడెను.

చాలకాలము రోమకులు యుధ్ధములలోఁ దిరుగుట వలన, పరదేశీయులు గాపురమువచ్చి వారి భూములను దున్నుచు భాగ్యవంతులయిరి. భాగ్యవంతు లయిన రోమకులు తమ భూములను హెచ్చు మొత్తమునకు కవులు వ్రాసినవారి కిచ్చుచున్నందున, నాదారుపడిన రోమకు లా మొత్తము లియ్య లేకపోయినందున, వీరు భూమినుండి తొలఁగించఁబడి, మోతుబరులైన పరదేశీయులు భూములను సాగుజేయుటకు నియమింపఁబడుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగినపైని, రోమకులు డీలాపడి, నిలుచుటకు నీడ, తినుటకు తిండి, కట్టుటకు బట్ట లేక యుండిరి.

ఇంతలో 'టైబీరియసు' ప్రజానాయకుండుగ (Tribune) నియమించఁబడెను. అతఁడు వారి దురవస్థను జూచి, దానిని సవరణఁ జేయుటకు సమకట్టెను. సామంతుల కది కష్టమయ్యెను; వారి లాభములు రాఁబడులు తగ్గును. వా రందఱొక్కుమ్మడి నతని నెదిరించిరిగాని, యతఁడు ప్రజల ప్రాపకము కలిగి యున్నందునఁ బూనిన కార్యమును నెరవేర్చెను, భూములు కొలిపించి, వానిని రోమకుల కప్పగించెను. పరదేశీయులు భూములనుండి తొలఁగించఁబడిరి. ప్రజలందఱు సంతసించి, యతనిని వేనోళ్ల బొగడిరి.