పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


అనంతర మతఁడు 'అక్షదర్శకు'ని (Consul) యుద్యోగములోఁ బ్రవేశించెను. భూమి తగాయిదాలు తుద ముట్టలేదు. సామంతులను సంసారులను బొత్తుపఱుచవలె నని యతఁడుద్దేశించెను గాని, సామంతులు మొఱకుతనముచేసి, యతనిని జంపుటకు గుట్రపన్నిరి. ఒకరోజున నతఁడు 'సెనేటు'సభలో ముచ్చటించుచుండెను. అప్పుడు సామంతు లంద ఱేకీభవించి, యతనిపై తిరుగఁబడిరి. అతఁడు లేచి పారిపోయెను; అల్లరి బల మయ్యెను. సామంతులు ప్రజలు రాళ్లురప్పలతోఁ గొట్టుకొనిరి. అనేకులు చచ్చిరి. 'టైబీరియను’ దుర్మరణము నొందెను. ఆ శరీరమును దహనముఁ జేయుటకు తమ్ముఁడు తీసికొని పోవుచున్నను, దానిని వారు బలవంతముగ లాగుకొని, 'టైబరు' నదిలోఁ బారవేసిరి. చనిపోవుసరికి, యతనికి 30 సం॥ రము.లు లేవు.