పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ములు పెద్ద. ఇట్టి తారతమ్యము లున్నను, న్యాయవిచారణలోను, నియామకముల ననుసరించుటలోను, శత్రువులను శిక్షించుటలోను, తదితర రాజకీయవ్యవహారములలో వారు సమానముగనుండిరి. ఈడులో నింత వ్యత్యాసము లేకపోయిన, వారు చేసిన కార్యములు విశేషముగ రాణించియుండును. ముందు పెద్దవాని చరితమును వ్రాయుచున్నాము.

పెద్దవాఁడు ధర్మాత్ముఁడు, శాంతస్వభావుఁడును గనుక, శకునజ్ఞుల (Augurs) కళాశాలలోఁ బ్రవేశించెను. వాని యోగ్యతనుజూచి, యా కాలములో రోమునగరములోఁ బెద్ద యుద్యోగముఁ జేయుచు పేరుఁబొందిన 'ఆపియసు- క్లాడియసు' తన కుమార్తె నతని కిచ్చి వివాహముచేసెను. అతని చెల్లెలిని 'చిన్న సిపియు'న కిచ్చి వివాహము జేసిరి. ఇతఁడు తేజోవంతుఁడు, పరాక్రమశాలి, రణవీరుఁడు. ఇతఁ డాఫ్రికాదేశములోఁ బోరాడుచున్నపుడు గ్రాకసు బావమఱఁదితోఁ గలసిపోయి, యుద్ధములోఁ దన బలపరాక్రమములను వెల్లడిచేసెను.

యుద్ధములో గెలిచి స్వాధీనముఁ జేసికొనిన భూములలోఁ గొన్ని రాష్ట్రమున కని, కొన్ని ప్రజల కని, యుంచి, మిగిలినవానిని రోమకు లమ్మివేయుచుండిరి. కొంతకాలమునకు సామంతుల ప్రభ ప్రబలమై, భూములన్నియు వారె యాక్రమించుకొనిరి. అందుచేత, నైదువందల యెకరములకంటె హెచ్చుభూమి కెవఁడును ఖామందుగ నుండకూడ దని యొక