పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


లన్నియు సరిగా నడచుచుండెను. రాజును, సామంతులను సంసారులను పిలిపించి సభఁ జేసి “ నేను వీనికన్న విశేషమైనది మరియొకటి చేయఁదలఁచితిని. మీరు దాని ప్రకారము నడుచు కొనియెద మని ప్రమాణముఁ జేసిన, నేను దానిని నెరవేర్చుదును. మీ యభిప్రాయమేమి?” యని యతఁడు వారి నడిగెను. అతఁడు చేసిన నిబంధనల ననుసరించి నడచుటకు వారు ప్రమాణముఁ జేసిరి. తాను చేయఁబూనిన కార్యమునకు ముందు సోదె యడిగి మంచి చెడ్డలను కనుగొనుట కతఁడు 'డెల్ఫి' యను పట్టణమునకుఁ బోయెను.

గ్రీసు దేశములోఁ బ్రసిద్ధికెక్కిన 'అపాలో' యను సూర్యదేవాలయము 'డెల్పి' యను పట్టణములోనుండెను. పూనిన కార్యములయొక్క జయాపజయములు కనుగొనుటకు దేశదేశములనుండి ప్రజ లిక్కడకు వచ్చి సోదె యడిగి తెలిసికొనుచుండిరి. 'డెల్ఫిసోదె' యని లోకవిఖ్యాత మయ్యెను. ఈ దేవాలయములో మధ్య నొక బిలముగలదు. దీనిలోనుండి యొకవిధమైన వాయువు పైకి వచ్చుచుండును. సోదె చెప్పుటకుముందు, బిలముపై నొక ముక్కాలుపీట వేసికొని, దానిమీఁద సోదెకత్తె కూర్చుండును. ఆమె తల కా వాయువు యెక్కఁగానె, యామె స్మారకము తప్పి, సోదె చెప్పును. ఆమె పలికిన పలుకులను దగ్గిఱనున్న యర్చకులు వ్రాయుచుండిరి. ఈ మాటలనే, 'అపాలో' దేవుఁడు భక్తు