పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైకర్గసు

131


నిచ్చువారు కావలెను. అందుచేత, వారుకూడ సామువిద్యలను నేర్చుకొని, మల్లయుద్ధము మొదలగువానిలోఁ దేరి పారిరి. పురుషులయెదుట వా రీవిద్యలను గనఁబఱుచుచుండిరి. వారికి స్వాతంత్ర్యముగలదు. ఇరువది సంవత్సరము లపుడు స్త్రీ వివాహమాడినను, భర్తతోఁ గలిసియుండుట లేదుగాని, రాకపోకలుమాత్రము గలవు. అన్యదేశపుకాంత యొకనాఁడు “మీలో స్త్రీలు పురుషుల నేలుదు”రని 'లియానుదాసు'ని భార్యను వ్యధికరణముఁ జేయ "మాస్పార్టను స్త్రీలే పురుషులను కనియెద”రని యీమె ఖండించెను. భర్తలను, కుమారులను శౌర్యము గనఁబఱుచునటుల వీరు ప్రోత్సాహపఱుచు చుండిరి. యుద్ధమునకు కుమారుఁడు వెళ్లునపుడు, "నాయనా, డాలుపట్టుకొని రమ్ము, లేదా దానిని పట్టుకొని పడిపొమ్ము” అని తల్లి వాని కుపదేశించును. స్త్రీ పురుషు లాటపాటలలో గలిసిమెలసి తిరుగుచుండిరి. బాగుగ నాట్యముఁ జేసినవారికి బహుమాన మిచ్చుట కలదు. ఈ మార్పులన్నియు 'లైకర్గసు' చేసెను.

ఇఁకను, స్పార్టనులు పైదేశములకుఁ బోవుట కాజ్ఞలేదు; విదేశీయులు వచ్చి వారి దేశములో నుండకూడదు. స్వదేశీయులు చెడిపోవుదు రను భయముతో నతఁ డీ నిబంధనఁ జేసెను. సమాధిస్థల మొకటి యేర్పఱచి, శవముల నక్కడనే సమాధి జేయునటుల యతఁ డుత్తరువు చేసెను. ఇటు లన్నివిధముల రాష్ట్రము నుద్ధరించి, యతఁడు సంతసించెను. రాజ్యాంగము