పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైకర్గసు

129


స్థు లేమి లంచము పుచ్చుకొనియెదరు? వారెటుల పెద్దవేషములు వేయఁగలరు? వ్యవహారములలో వా రమాయకులు. అందుచేతనే "స్పార్టను అమాయకత్వ”మని లోకప్రసిద్ధి యయ్యెను.

ఈ మూలముననేగాక, మరియొక విధమునగూడ వారికి విషయభోగములయం దతఁడు వారికి విముఖత గలుగఁజేసెను. ఆ బాలవృద్దులందఱు కలిసి పంక్తిభోజనముఁ జేయవలసిన దని యతఁడు నియమించి, భోజనములోఁగూడ నిర్ణయించఁబడిన పదార్థములనె యుక్తముగ వారు భుజించవలయునుగాని, నిషేధింపఁబడినవానిని పుచ్చుకొనఁగూడదు. గృహములో భోజనముఁ జేసినవాఁడు గర్హ్యుఁడు. ఇటుల సహపంక్తిని వారు భుజించుటవలనఁ బొందిన లాభములను జెప్పనేల? యుక్తాహారమును మితముగ గ్రహించినందున నిరోగులై శరీరసాటవము గలవారైరని వచింపవలెనా? 'దేహబలమే' మనోబలము కదా!

స్పార్టాలో మగశిశువు కలుగఁగానే, దానినందఱుఁజూచి, మంచి యేపరి, దృఢశరీరము కలవాఁడగునని తోఁచిన, దానిని గృహములోఁ దల్లివద్దనుంచుదురు. ఆ శిశువే ముందుకు బలహీనుఁడు, కునిష్ఠియగునని వారికిఁదోఁచిన, దానిని, దీసికొని పోయి వారు, సమీపముననున్న కొండమీఁద పారవేయు చుండిరి. గృహములో పెరిగిన శిశువు, తల్లివద్ద నేడుసంవత్స