పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


యుల మర్యాదలను హక్కులను యథావిధిగ నిలబెట్టుచుండెను. ప్రజలు హర్షించి, యతనిని బొగడిరి.

ఆకాలమునాఁటికిఁ బ్రజలు భూములను సరిగా ననుభవించుట లేదు. కొంతభూమి సాగులేక పడియుండెను. సాగుబడి యగుచున్నదానిలోనైన ప్రజలకు హక్కు లేదు. కొందఱికి భూములు గలవు, కొందరికి లేవు. లైకర్గసు ప్రజలసమ్మతిపైని, ముందుజనాభా యెత్తించి, భూమిని కొలిపించెను. అప్పుడు దా మాషాయిని భూమిని వారి కతఁడు పంచెను. సాగులేని భూములను వరకట్టుట కతఁ డాప్రకారమె వారికిచ్చెను. వారిలో భాగ్యవంతుఁ డని బీదవాఁడని తారతమ్యము లేదు. సుగుణ దుర్గుణములచేత నెవఁడైన బేరుపొందవలెను గాని, ధనముచేతఁగాదు. చరాస్తులనుగూడ సమానముగ పంచవలె నని యతఁడు గోరెనుగాని, ప్రజలందు కంగీకరించలేదు. అందు కతఁడు వారికి బుద్ధివచ్చునటుల నొకమార్పు చేసెను. టంక శాలలలో బంగారు వెండి నాణెములను ముద్ర వేయింపించక, యినుప- నాణెములను ముద్ర వేయింపించి, వీనిని చలామణిలోనికిఁ దెచ్చెను. ఈ నాణెము లెన్ని పోగుచేసిన, నొక బ గారు, వెండి నాణెముతో సమానమగును? అవి పెద్దవియగుటచేత, - వానినైన సునాయాసముగఁ దీసికొని వెళ్లుటకుఁ బ్రజలకు కష్టముగనుండెను. అందుచేత వారికి తృష్ణపోయెను; వెండి బంగారములకు వారు దూరస్థులయిరి. సర్కా . రుద్యోగ