పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


జేయ నారంభించిరి. ముందు, వెనుక , ప్రక్కను ఎక్కడను శత్రువులే; దూరమునను, సమీపమున వారలే; నిలిచి యుద్ధము సేయరు. ప్రాణములు దక్కించుకొని, రోమకులు 'ఆంతొని'తో బయటవచ్చి పడిరి. ఎందఱు రోమకులు శత్రు దేశములోఁ జనిపోయిరో చెప్పలేము.

“భ్రష్టస్య కావా గతిః.” దుర్వ్యసనములలోఁబడిన మనుజునకు బుద్ధిమాంద్యము గలుగును. ఇటు లపజయము బొంది, బాధపడుచున్న, నతని మనస్సు 'క్లియోపాత్రా' యందు ప్రసరించెను. ఆమెను జూచి యతఁ డమందానంద మొందెను. ఇంతలో నతని భార్య పిల్లలతో వచ్చెదనని వర్తమానముఁ బంపెను. కొంతసైన్యముతో నామె ధనమును, తినుబడి వస్తువులను, సైనికులకు దుస్తులను బట్టుకొని, బయలుదేరెను. ఈ సంగతి వినినతోడనె, 'క్లియోపాత్రా' మనస్సున సవతివైర మంకురించెను. ఒకప్పుడు సొక్కుచు, సోలుచు, భోజనము మాని కృశించి, భర్తృవియోగమును భరించ లేనిదానివలె నతని యెదుట నటించెను. అతని కామెయం దిరువురు పిల్లలు గిలిగిరి. ఈమె వలపులకుఁ జిక్కి, 'ఆథెన్సు' పట్టణములో నుండ వలసినదని భార్య కతఁడు జూబు వ్రాసిపం'పెను. దేశములు దోచితెచ్చిన ధనమునెకాదు, దేశములనె నతఁడు క్లియోపాత్రా కిచ్చివేసెను. ఆమె 'ఈజిప్టు'దేశపు రాణి; ఇప్పుడు మరి నాలుగు దేశములకుకూడ రాణియని ప్రకటింపఁబడెను.