పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కు-ఆంతోని

123


ఇంతియకాదు - ఆంతొనికి మొదటిభార్య 'పుల్వియాకు' కలిగిన బిడ్డలు, రెండవభార్య 'ఆక్టేవియా'కు జనించిన వారు, 'క్లియోపాత్రా'కు బుట్టినవారు కలరు. వీరిలో నాఖరువారి నతఁడు దేశములకు రాజులుగఁ జేసెను. అతని భార్య రోము నగరమునకుఁ బోయి, యక్కడ భర్తృగృహములోనుండి, తన పిల్లలను సవతిపిల్లలను బెంచుచు, భర్తయొక్క గౌరవమును జెడగొట్టక, తమ్ముఁడైన 'అగస్టసు'కు భర్తపైని కోపముబుట్ట కుండునటుల ప్రవర్తించుచుండెను. ఆమె యవస్థఁ జూచి, యందఱు దుఃఖాక్రాంతులై, రగులుచుండిరి. రోమునగరమునకు వచ్చినపు డతఁడు రాణిననుసరించి తిరిగెనుగాని, భార్య నక్కఱ చేయలేదు,

అనంతర మతఁ డామెతో 'ఈజిప్టు' దేశమునకుఁ బోయెను. అతనికి, 'అగస్టసు'కు వైరముపుట్టెను. ఇరువురు సైన్యములను బోగుచేసిరి. ఆంతోనికి దైవబలము లేదు. 'దైవీ బలే దుర్బలే'. అతని భూ నావికాసైన్యములు గొన్ని యోడి పోయెను. మిగిలినవి 'అగస్టసు'పక్షమునకు వెళ్లెను. ఇటుల పరాభవము బొంది, 'ఆంతొని, క్లియోపాత్రా'లు 'ఈజిప్టు' వచ్చిచేరి, సంధిమాటలలోకి దిగిరి.

ఈ మాటలు విని, 'అగస్టసు' ఆమె కభయమిచ్చుటకు నిశ్చయించెనుగాని, అతనిని దండించెద నని వర్తమాన మును బంపెను. సైన్యమును దీసికొని 'అగస్టసు' వారి పట్టణము