పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కు-ఆంతోని

121


తిరుగుబాటు చేసినందున, వారిని దండించుట కతఁడు తన 'ఉపసేనాని'ని సైన్యముతోఁ బంపెను. ఇతఁడు పోయి శత్రువుల నోడించెను.

ఇంతలో 'అగస్టసు' కొన్ని వ్యాపారములను వ్యతిరేకముగఁ జేయఁ దలపెట్టెనని విని, 300 నావలను దీసికొని 'ఆంతొని' స్వదేశమునకు వచ్చెనుగాని, యే రేవు పట్టణములో నిలఁబడుట కతనికి వీలులేకపోయెను. అప్పు డతని భార్య నిజమైన సంగతిని గనుగొనుటకు తన యన్నయొద్దకు వెళ్లెను. బావ మఱదుల కామె సంధిచేసెను. భూ సైన్యములో రెండు దళములు 'ఆంతొని' కిచ్చుటకు 'అగస్టసు' ఒప్పుకొనెను; ఇతనికి నూరు నావల నిచ్చుట కతఁ డొప్పుకొనెను. పిల్లలను, గర్భిణితోనున్న భార్యను 'అగస్టసు' కప్పగించి, యతఁడు తూర్పుదేశములకుఁ బోయెను. 'కుమారపాంపేయుఁడు' తిరుగుబాటు చేసినందున, వానిని దండించుటకు 'అగస్టసు' 'సిసిలీ' ద్వీపము వెళ్లెను.

'ఆంతొని కొంతకాలము గ్రీసులోను, కొంతకాలము 'క్లియోపాత్రా' సన్నిధిని గడిపెను. ఎక్కడనున్నను, నతఁ డామెను స్మరించని దినములేదు. ఇంతలో 'పార్థివుల'తో యుద్ధము తటస్థమయ్యెను. రోమకులు వారితోఁ బోరాడిరి; జయాపజయములు తెలియవు; నిలుచుటకు నీడ, తినుటకు తిండి, రోమకులకు లేకపోయెను. శత్రువులు దొంగయుద్ధము