పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90
ప్లూటార్కు వర్ణితచరిత్రలు


మహోన్నతపదవిని జూచి వారి నా పదవిలోనుండి దిగఁద్రోయుటకు వారి శత్రువు లీ యుద్ధము నారంభించిరి. పెరికిలీసు పూర్ణశక్తితో నీ యుద్ధమును జరిపెను. కొందఱి కతఁ డిష్టుఁ డయ్యెను. స్వదేశాభిమానముచేత, శత్రువులతో నతఁడుఁ బోరాడెను. రెండు కక్షలవారు సమరసన్నాహముఁ జేసిరి. క్రీ. పూ, సం: 431 రములో నీ యుద్ద మారంభమయ్యెను.

ఒక సంవత్సరము యుద్ధము జరిగెను. జయాపజయము లెవరికిని నిర్ణయము కాలేదు. రెండవ సంవత్సరమున, నగరములో మహామారి సంకటము ప్రవేశించెను. వేలకొలఁది జనులు రణములో మడిసిరి. హతశేషులు మహామారినోటిలోఁ బడిరి, నగర మల్లకల్లోలముగ నుండెను. ఎక్కడఁ జూచిన హాహాకారముతప్ప మఱియొకటి లేదు. ప్రజలందఱు పెరికిలీసును దూషించిరి. సేనాధిపత్యము నతఁడే వహించియుండెను. యుద్ధముమాత్రము వారు మానలేదు. మహామారి సంకట మతనికి వచ్చి క్రీ. పూ. సం|| 421 రమున నతఁడు కాలధర్మమునొందెను. అవసానకాలమున నతనియొద్దనున్న వా రతని మహత్కార్యములను జెప్పుకొనుచుండిరి. ఆ మ టలను విని, “అదృష్టము చేత వానిని జేయఁగలిగితిని. అందులో విశేషములేదు. నే నెవరి కొంపతీసితి నని యెవరు చెప్పలేదు” అని పెరికిలీసు మందముగఁ బలికి యూరకొనెను.

ఈ యుద్ధమునకుఁ గారణములు తెలియవు గాని, పెరికి