పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
89
పెరికిలీసు


నతఁడు వేయించెను. నాట్యశాలలు, గరడీలు గట్టఁబడెను. సరోవరములు ద్రవ్వఁబడెను. పట్టణమంతయు మహావైభవముతోఁ గూడి 'గ్రీసుదేశమునకు నయన'మను ప్రఖ్యాతిని బొందెను. రాజ్యన్యయముక్రింద లెక్క వేసి ఇన్ని గట్టించుటచేతఁ గొంద ఱతనిని దూషించిరి. అప్పు డతఁడు సభలో లేచి, "ప్రజల ధనము వ్యయము చేసి వీనిని నేను కట్టించితినని మీకు తోఁచినపక్షమున వానికైన వ్యయమును నేను భరించి వానిమీఁద నా పేరు వ్రాయించెద"నని చెప్పెను. అతని యౌదార్యమునకుఁ బ్రజలు సంతసించి, “తమ యిష్టానుసారము మా ధనము తమరు వ్యయము చేయవచ్చును; మీరు మంచిపనులు చేయించితి"రని ప్రతివచన మిచ్చిరి. అతనిని దూషించిన వారిలోఁ బ్రధానుఁడైన వానిని వారు దేశోచ్చాటనముఁ జేసిరి.

స్కంధత్రయము తెలిసి, రోగిని వైద్యుఁ డెటులఁ జూచునో యావిధమున త్రిశక్తులు కలిగిన 'పెరికిలీసు' ప్రజలను బరిపాలించెను. వారిని నడిపించుశక్తి యతఁడు బాగుగ గుఱ్తెఱిఁగి యుండెను. యంత్రకారుని చేతిలో యంత్రములు తిరుగునటుల, ప్రజ లతనియెడఁ బ్రవర్తించిరి.

ఈకాలములో స్పార్టనులకు ఆధీనియనులకు యుద్ధ మారంభమై సుమారు పది పదునేను సంవత్సరములవఱకు ౙరిగెను. అథీనియనులయొక్కయు వారి రాజ్యముయొక్కయు