పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెరికిలీసు

91


లీసు దానికిఁ గారకుఁడని చెప్పుదురు. ఈ నిందతప్ప మఱియొక టతనికి లేదు. ఇంతకాల మవిచ్ఛిన్నముగఁ జంచలబుద్ధిగల 'నథీనియనుల' నతఁడు పరిపాలించుటచేత నతనికి గుణాధిక్యత కలిగెను. ప్రజా రాజ్యముగ నున్న పట్టణమును మహారాజ్యాధి పత్యములోని నగరముగఁ జేయవలెనని యతఁడు యత్నించెను గాని వ్యవహారలోపములవలననో లేక మఱి యే కారణములచేతనో నది సాగలేదు. ఆది లేకపోయినను, నగరవాసు లందఱు విద్యల నభ్యసించి పట్టణమునకుఁ గీర్తి ప్రతిష్ఠలను దెచ్చిరి. సాహిత్యనాటకాలంకారశాస్త్రములు పరిఢవిల్లెను. వక్తృత్వమును వా రభ్యసించిరి. కవులకుఁ గొదువలేదు. గాయకులు మన్ననలఁ బడసిరి. 'పెరికిలిసు రాజ్య'మని యతని ప్రభుత్వకాలము పేరొందెను.