పుట:Madhavanidanamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నను శిరస్సునందును హృదయమునందును అధికముగ నొప్పికల్గు నని తెలుపుటకై "శిరోహృద్గాత్రరుక్" అని ప్రత్యేకముగ గ్రహింపబడు;ను.

పైజెప్పినలక్షణములుగాక మరికొన్ని లక్షణములు గూడ వాతజ్వరమునందు కలుగునని సుశ్రుతాచార్యుడు తెలిపెను. పలుదెరంగుల నొప్పులు, కాళ్లయందు తిమ్మిరి, పిక్కలనొప్పి, చెవిలో గుమ్మని ధ్వని, నోట వగరు, తొడలు చిక్కియుండుట, అంకిళ్లు పట్టుకొనియుండుట, సంధిబంధనములు సడలినట్లు బాధ, పొడిదగ్గు, వాంతి, ఒడలు జలదరించుట, బడలిక, చక్రభ్రమణమువలె ఒడలు తిరుగుట, మూత్రము నేత్రములు ఎఱ్ఱబడుట, దప్పి, అర్ధములేక మాటలాడుట, ఉష్ణోపచారమును గోరుట ఇవి మున్నగు లక్షణములు వాతజ్వరమున కలగు నని చరకంబున గానంబడియెడు. మరియు సర్వావయములయందు పలుదెరంగులైన బాధలు; చెవులు వినబడకుండుట, మూత్రపురీషముబైట సరళముగ వెడలక బద్ధగించియుండుట, మాడున నొప్పి కలగును. చెమటపట్టుట, ఆహారము జీర్ణముగాకుండుట ఈలక్షణములుగూడ గల్గు గ్రంధాంతరమున కనబడుచున్నవి.

ఇచ్చట త్రిదోషములలో వాతము ప్రధానమైనది. "పిత్తం కల్గు కఫ: పల్గుకిపజ్గనో మలధాతేఐ:, వాయునా యత్ర నీయన్తే తత్ర గచ్చన్తి* చేతరే" అని యుండుటంజేసి పిత్తకఫములు రెండును స్వతంత్రతలేక వాత మెచ్చటికి గొనిపోయిన నచటి కేగుచుండు నని తెలియుచున్నది. వాతాదిరోగముల పరిగణనము చేయునపుడు వాతరోగంబు లెనుబది, పిత్తరొగములు నలువది, కఫరోగములు ఇరువదియు నని చరకాచార్యుడు పరిగణనము జేసియున్నాడు. పైవిషయములను పరిశీలించినచో కఫమునకన్న పిత్తము, ఈరెండిటికన్న వాతము బలవత్తరమని తెలియుచున్నది గాన అట్టి తారతమ్యము ననుసరించి ఆయారోగములను వివరించుతరి తొలుత వాతికములను, పిమ్మట నైతికములను, వరుసగాచెప్పుట యాయుర్వేదమున సమంజసపద్ధతిగా నున్నది.


పిత్తజ్వరలక్షణము

వేగస్తీక్ష్ణోంతిసాదశ్చ నిద్రాల్పత్వం తధా వమి:,
కణ్థౌష్ఠముఖనాసానాం పాకస్స్వేదశ్చ జాయతే. 10
ప్రలాపో వక్తకటుతా ముర్చా దాహో మద స్తృషా,
పీతవిణ్మూత్రనేత్రత్వం పైత్తికే భ్రమ ఏవ చ. 11


  • "మేఘవత్" అని పాఠముగూడ గలదు.