పుట:Madhavanidanamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపైరన్యతరాభ్యాస్తు సంసృష్టేర్ధ్వన్ద్వజం నిదు:,
సర్వలిజ్గస్మనాయస్పర్వదోషప్రకోపజే. 7

వాతజ్వరము కల్గుటాకు పూర్వము (పైజెప్పబడిన సామాన్యరూపములు కనబడుటయకాక) యెడలివిరుపులు ఆవలింతలు విశేషముగ కల్గును. పిత్తజ్వరమున కన్నులు విశేషముగ నుండును. నీరు అధికముగ వెదలును. కఫజ్వరమున నాహారాపదార్ధములయందు రుచిపుట్టదు. వాతపిత్త వాతకఫ పిత్తకఫసంసర్గమున గల్గిన ద్వంద్వజ్వరములయందు ఆయాదోషములకు ప్రత్యేకముగ జెప్పిన రెండేసి పూర్వగూపములు మిశ్రమముగ గన్పించును. త్రిదోషప్రకోపముచే గల్గిన సన్నిపాతజ్వరమున మూడుదోషములకు ప్రత్యేకముగ జెప్పిన పూర్వరూపములన్నియు గాన్పించును.

దోషద్యయప్రకోపమున గల్గిన వాతపిత్తజ్వరము గల్గుటకు మున్ను ఒడలి విరుపులును, కన్నులమంటయు విశేషముగ గల్గును. పిత్తకఫజ్వరమున కండ్లుమంటయు, ఆరోచ్కమును అధికముగ కల్గును. త్రిదోషసన్నిపాతమున జనించిన సాన్నిపాతికజ్వరమున పైజెప్పిన ఒడలివిరుపు, కండ్లమంట, ఆరోచకము ఈమూడును మిక్కుటముగ గాన్పించును అని భావము.

వాతజ్వలక్షణము

వేపధుర్విషమో వేగ: కణ్ణౌష్ఠపరిశోషణమ్,
నిద్రానాశ:క్షసప్త్సమ్బో గాత్రాణాం రౌక్ష్యమేన చ. 8
శిరోహృద్దాత్రరుగ్వక్త్రవైరస్యం గాఢవిట్కతె,
శూలాధ్మానే జృమ్బణం చ భవత్యనిలజే జ్వరే 9

శరీరము వడవడ వణకుట, జ్వరవేగము నియమము లేక ఒకప్పు డధికముగను మరియొకప్పుడు తక్కువగను మారుచుండుట, గొంతునందును విదపులమీదును చెమ్మలేకయుండుటా, నిదురబట్టాకుండుట, తుమ్ములు విశేషముగ వచ్చుట, అవయవములు స్తంబించియుండుట, శరీరము జిడ్డులేక గరగరమని యుండుట, తల రొమ్ము తక్కిన శరీరము ఈ చోట్ల నొప్పి, నోట రుచి తెలియకుండుట, మలము ద్రవములేక గట్టిగ నుండుటా, కడుపుబ్బరముతోగూడి నొప్పికలుగుట, ఒడలి విరుపులు ఇవి యన్నియు వాతజ్వరమున కలగును.

కడుపులో గుడగుడ యనుశబ్ధముతొగుండ నొప్పికలిగి యుబ్బరించినది. యుద్మానము. ఇచ్చట 'గాత్రరు ', అనుటచేతనే శరీరమందంతట నొప్పిగల్గునని యర్ధమగు