పుట:Madhavanidanamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్చట జ్వజ్రము కల్గుటకు వాత-పిత్త-కఫములు దోషము లనియు, రసధాతువు దూష్య మనియు దోషదూష్యవిభాగము నెరుంగునది.

జ్వరసామాన్యలక్షణము

న్వేదావరోధస్సన్తాపస్సర్యజ్గగ్రహణం తధా,
యుగపద్యత్రరోగే చ స జ్వరో వ్యపదిశ్యతే, 3

చెమట వెడలకుండుట, దేహమునందటను వేడి య;థికిఅముగ నుండుట, చక్షురాదీంద్రియములకును, మనస్సుకును తాపము గల్గుట. శరీరమునందట పట్టినట్లు నొప్పికల్గుట. ఈలక్షణములన్నియు సమకాలమున కలిగెనేని అయ్యది జ్వరమని ముఖ్యముగ వ్యవహరింపబడును. (పైలక్షణములన్నియు జ్వరమున సంభవించుట) వాతము ప్రకుపిత్తమై చెమటవెడలు రంధ్రముల నన్నిటిని నిరొధించుటంజేసి జ్వరము వ్యాపించినపుడు చెమట బైట వెడలకుండు నని భావము.

జ్వరసామాన్యపూర్వరూపము

శ్రమోంరతిర్వివర్ణత్వం వైరస్యం నయనప్లవ:,
ఇచ్చాద్వేషా ముహుశ్చాపి శీతవాతాతపాదిషు. 4
జృమ్బాజ్గమర్దో గురుతా రోమహర్షోంరుచిస్తమ:,
అప్రహర్షశ్చ శీతఞచభవత్యుత్పత్స్యతి జ్వరే. 5
సమాన్యత:.

శరీరము బడలియుండుట, మనస్సు చంచలమై అన్నివిషయములందును ఆసక్తి లేకుండుట, దేహము మామూలుగ నుండురంగు మారి క్రొత్తరంగు కల్గియుండుట, నోటికి మధురాదిరసములు మామూలుగ దెలియకుండుట, కన్నులయందు నీరుగారుట, శీతోపచరములయందును, గానియందును, ఎండ మున్నగువానియందును సూటిమాటికి ఇష్టము ద్వేషము మారిమారి యుండుట, ఒడలివిరుపులు, ఆవలింతలు కల్గుట, ఒడలి నొప్పులుగల్గి బరువుగ నుండుట, శరీరమునందు రోమములు నిట్రబొడిచియుండుట, నోటరుచి లేకుండుట, కన్నులు చీకటిగ్రమ్మినట్లు కనపడకుండుట, మనసు కుత్సాహము లేకుండుట, ఉండియుండి చలిగల్గుట ఈలక్షణములన్నియు జ్వముగల్గుటకు మున్ను గాన్పించును. పైజెప్పిన యెనిమిదివిధలగు జ్వరము లన్నిటియందును సామాన్యముగ గనిపించును కావున ఇది జ్వరమునకు సామాన్య పూర్వరూపము.

జ్వరవిశేషపూర్వరూపములు

విశేషాత్తు జృమ్బాత్యర్ధం సమీరణాత్,
వెత్తాన్నయనయోర్ధాహ:, కఫాదన్నా రుచిర్భవేత్. 6