పుట:Madhavanidanamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్వరవేగము మిక్కిలి తీవ్రముగ నుండుట, పలుమరు ద్రవముగ మలము వెడలుట, నిదుర స్వల్పముగబట్టుట, పసరు వమనమగుట, కుత్తుకయందును, పెదవులయందును, నోటియందును, నాసారంధ్రములయందును పుండగుట, చెమటపట్టుట, సంబంధములేని భ్రమమాటల మాట్లాడుట, నోట చేదు గల్గుట, మతితప్పి మూర్చకల్గుట, శరీరమునందెల్ల మంట, అధికముగ దప్పి, కల్లుసరాయి త్రాగినవిధముగ మత్తు గల్గియుండుట, మలము మూత్రము నేత్రములు పచ్చనైయుండుట, చక్రముబోలె శరీరము తిరుగుచున్నట్లుండుట, లేక యితరవస్తువులు తిరుగునట్లు గనబడుట, ఇవి యన్నియు పిత్తప్రకోపము గల్గిన జ్వరమున గనబడు లక్షణములు.

చరకమునందు శరీరముపై తీవ్రమైనవేడి, రక్తవర్ణములైన బొబ్బలు, చల్లని యుపచారములంయం దిచ్చగొనుట, అరుచి మున్నగులక్షణములుగూడ గ్రహించును.

ఇచ్చట భ్రమము వాతరోగములలో పరిగణింపబడినదియైన్ను వాతసంబంధమునంజేసియే పిత్తజ్వరమునగూడ సంభవించును. "న రోగోంప్యేకదోషజ:" అను వచనాంతరముచే నొకదోషము ప్రధానముగనుండి యేదైన నొకభోగము కల్గినను తక్కినదోషములు సహకారులై యుండు నని తెలియుచున్నది. కావున ప్రకృతమున పిత్తజ్వరమునందును వాతసంభంధమునంజేసి భ్రమము గల్గునను తక్కినదోషములు సహకారులై యుండు నని తెలియుచున్నది. కావున ప్రకృతమున పిత్తజ్వరమునందును వాతసంబంధమునంజేసి భ్రమము గల్గు నని యెరుంగునది. ఇత్తెరంగుననే ఇతరదోషముల లక్షణములును ఆయారోగములయందు కనబడును. మరియు "రజ:పిత్తానిలాద్భ్రమ:" (సుశ్రుత.శా.అ.4) అని సుశ్రుతులు చెప్పిరి కాన వాత పిత్తముల రెండిటిచేత భ్రమము కల్గు నని యెరుగునది.

కఫతజ్వరలక్షణము

స్తైమిత్యం స్తిమితో వేగ: ఆలస్యం మధురాస్యతా,
శుక్లమూత్రపురీషత్వం స్తమ్బస్తృప్తిరడాపి చ. 12
(నాత్యుష్ణగాత్రతా చర్ధి: అజ్గసాదోంవిపాడితా)
గౌరవం శీతముముత్ల్కేదో రోమహర్షోంతినిద్రతా,

  • (స్రోతోరోధోరుగల్పత్వం ప్రనేకొ లవణాస్యతా,

నాత్యుష్ణ గాత్రతా చ్చర్దిర్లాలాస్తాప్రోవోం నిపాకతా.)
ప్రతిశ్యా యోం రుచి: కాస; కఫజేం క్ష్ణోశ్చ శుక్లతా. 13

మంచుచే దడిసినట్లు శరీరము మొద్దుబారియుండుట్ జ్వ్రముతీవ్రగ వ్యాపింపక మందవేగముగ నుండుట, పనులు చేయుటాయందు ప్రాలుమాలికచే నాసక్తి


  • ప్రక్షిప్తము. మధుకోకవ్యాఖ్యాకారుడు చెప్పలేదు.

మాధవ----3