పుట:Madhavanidanamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదరమువలన శోధము (వాపు) సంభవించును. అర్శోరోగముచేత జఠరము (ఉదరము) కల్గును. గుల్మమొకూడ కల్గును. పగలు నిదురించుటా మున్నగుకారణములచేగల్గిన పీనసము (పడిసెము) వలన కాసవ్యాధి కల్గును. కాసనమువలన క్షయము కల్గును. అయ్యది శోషమునకు హేతువగును. (ఇది చరకమున జెప్పినవిధానము. మాధవకరుడు దానిని తనగ్రంధమున ననుసరించి చెప్పె నని యెరుంగునది.)

రోగము రోగాంతరమును కల్గించుక్రమము

తే పూర్వం కేవలా రోగా: వశ్చాద్ధేత్వర్ధకారిణ:,
కశ్చిద్ధి రోగో స్య హేతుర్భూత్వాప్రశామ్యతి. 19
న ప్రశామ్యతి చాసన్య: హేతుత్వం కురుతేంపి చ,
ఏనం కృచ్చ్రతమా నృణాం దృశ్యంతే వ్యాధిసజ్కరా:. 20
తస్మాద్యత్నేన సద్త్వైద్త్వై: ఇచ్చద్భిస్సిద్ధిముద్ధతామ్,
జ్ఞాతవ్యో వక్షతే యోంయం జ్వరాదినాం వినిశ్చయ:. 21

పైజెప్పబడినవిధముగ ఒకరోగము మరియొకరోగమును గల్గిచునపుడు తొలుత వారోగములు స్వతంత్రములుగ జనించి బాధించునపుడు వానికి దగిన చికిత్స చెయక యూపేక్షించినయెడ నవి బలిష్టములై యితరరోగములను గల్గించును. అట్టియెడ నారోగములు రోగహేతువుబోలి యుండును. అందు నొకరోగము మరి యొకరోగమును గల్గించి తనకుతానే శమించును. మరియొకరోగము ఇంకొకరోగముతోగలిసి బాధించు చుండును. ఇత్తెరంగున మనుజులకు వ్యాధులు పలుతెరంగుల లోకమున గాన బడుచున్నవి. కావున వ్యాధినివృత్తిరూపో మైన రార్యసిద్ధిని గోరు సద్వైద్యులు మిక్కిలి సూక్షమైనబుద్ధిచేత పైన జ్వరాదిప్రకరణములయందు జెప్పంబడు రోగనిశ్చయమును గుర్తెరింగి ఆయావ్యాధుల గమనించి ప్రతివిధానముచేయుట ముఖ్యము.

ఇతి శ్రీమాధవకరవిరచితే మాధవనిదానే పఞ్చలక్షణనిదానం

స మా ప్తం.