పుట:Madhavanidanamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.జ్వ ర ని దా న మ్

అవతారిక:-- పైప్రకరణమున పఞ్చలక్షణనిదానము వివరింపబడినతి. పఞ్చలక్షణ మనగా నిదాన - పూర్వరూప - ఉపశయ - సంప్రాప్తములయొక్క లక్షణములు. అయ్యవి జ్వరాదిరోగములయం దన్నిటియందును సామాన్యములు. గ: విషయమునే వాగ్భటాచార్యులు "ఆధాతంసర్యరోగనిదానం వ్యాఖ్యాస్యామ:" అని నిది నారంభమున చెప్పెను. నిదానపూర్వరూపాదులు ఐదు సర్వరొగసామాన్యముగ నుండుటంజేసియే పంచలక్షణనిదాన మనుదానిని సర్వరోగనిదాన మని వాగ్భటాచార్యులు వ్యవహరించెను. మరికొంద రాచార్యులు సర్వరోగవిజ్ఞానీయ మనియు దీనిని వ్యవహరించిరి. ఎవ రెట్లు చెప్పినను సకలరోగములను గుర్తించుటకు ప్రధానములగు పూర్వరూపాదుల లక్షణ్; అములను దెల్పునది యను నర్ధము సమానము. కావున అట్టి సర్వరోగములకు వ్యాప్తమైన పఞ్చలక్షణనిదానమును నుడివిడినపిదప ఆయారోగలక్షణములను ప్రత్యేకముగ వివరించుట యావశ్యకము. అందును జ్వ్రము ప్రధాన మగుటంజేసి జ్వరనిదానము తొలుదొలుత వివరింపబడును. ఇయ్యది సకలమానవులకు పుట్టుక మొదలు ఏవ్యాధి రానున్నను తొలుత ప్రాయికముగ వ్యాపించును. దేహము, ఇంద్రియములు, మనస్సు మున్నగు వానిని తపింపజేసి వ్యాపించునది. జన్మ మరణములయందు నియతముగ సంభవించునది. ఇంతియేకాక ఇయ్యది మనుజకోటికి మాత్రమేకాక సృష్టికి లోనైన స్థిరచరములకన్నిటికిని సంభవించునని చరకాచార్యులు ఉపదేశించియున్నారు.

మరియు గ్రంధాంతరమున నీజ్వరము జంకుభేదముచే నామాంతరమున బేర్కొనంబడియున్నది. అందు ఏనుగులకు పాకముల మనియు, గుఱ్ఱముల కభిపాతంబనియు, ఆవుల కీశ్వర మనియు, ఎనుబోతులకు హారిద్రం బనియు, జింకలకు మృగరోగం బనియు, పక్షుల కభిఘాతం బనియు, చేపాల కింద్రిమదం బనియు, పాముల కక్షిక మనియు, నీటికి నీలిక మనియు, పతంగంబులకు పక్షవాతం బనియు, వృక్షజాతికి కోటరము (తొఱ్ఱ) అనియు, భూమికి ఊషరం బనియు, మనుజసామాన్యమునకు జ్వరం బనియు వామభేదముచే వ్యవహరించిరి. ఐనను వ్యాధి స్వరూపమున భేదము గానరాదు. ఇట్టికారణములచేత జ్వరము తక్కిన రోగముల కన్నిటికిని ప్రధానంబని యార్షమత సిద్ధాంతము.