పుట:Madhavanidanamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండురసములం గలపదార్ధలను భుజించినను, తీక్షగుణముగల ఆవాలు మున్నగు వానిని ఉష్ణగుణముక్ల పదార్ధములను భుజించినను, ఉప్పుకలపదర్ధములను భుజించినను, పిత్తము ప్రకోపము నొందును. మరియు కోపపడినను, మంటలుట్టించు పదార్ధముల తిన్నను, శరత్కాలములనందును, మధ్యాహ్నకాలములనందును, అర్ధరాత్రికాలములనందును మిక్కిలి సంతాపము కల్గిన సమయములయందును పిత్తము ప్రకోపించును. తీపి, పులుపు, ఉప్పు అను రసములు కల పదార్ధములనైనను, మిక్కిలి జిడ్దుగల పదార్ధములనైనను ప్రోతంసులయందు ద్రవమును బుట్టించు పదార్ధములనైనను, శీతలపదార్ధములనైననుభుజించినను; విశేషముగ కూర్చునియున్నను, ఎక్కువగా నిద్రపోవుచున్నను, భుజించినయాహారము జీర్ణము గాకున్నను, పగటి యందు విదురించినను, శరీరమును మిక్కిలి బలియంజెయు పదార్ధముల భుజించినను, సమనాది క్రియలను వానివానికి నియమితమగుకాలమున జేసికొనకున్నను కఫము ప్రకోపించును. మరియు భోజనమున కుత్తరక్షనమునను, వసంతకాలమునందును, పగలు మొదటి (మూడవ) భాగమునందును, రాత్రి మొదటి (మూడవ) భాగము నందుకూడ కఫము ప్రకోపించును. పైజెప్పిన యాహారవిహాదులలొ రెండేసి దోషములకు జెప్పినవి సంకరముగ సేవింపబడిన యెడరెండేసిదోషములు ప్రకోపమునొందును. అన్నింటిని సంకరముగ సేవించుటచేత నన్నియు ప్రకోపము నొందును. ఇత్తెరంగున సమాన్యముగ త్రిదోషములయొక్క ప్రకోపకారణముల నెరుంగునది

చరకోక్తనిదానము

నిదానార్ధకరో రోగో రోగస్యాప్యుప్జాయతే 15
తద్యధా జ్వరసంతాపాద్రక్తపిత్తముదీర్యతే,
రక్తపిత్తాజ్జ్వర:, తాభ్యాం శోషశ్చాప్యుపజాయతే 16
ప్లీహాభివృద్ధ్యా జకరం జఠరాచ్చోధ ఏవ చ,
అర్మేభ్యోజాకరం దు:ఖం గుల్మశ్చాప్యుపజాయతీ 17
(దివాస్వాపాదిదోషైశ్చప్రతిశ్యాయశ్చజాయతే,)
ప్రతిశ్యాయాదరధో కాస: కాసాత్సజ్ఞాయతే క్షమ:,
క్షయో రూగస్య హేతుత్వే శోషస్యాప్యుపజాయతే, 18

ఒకసమయమున స్వవారణములగు మిధ్యాహారవిహారాదులచే గల్గినరోగము ఇంకొకరోగమును నిదానమునుబోలె గల్గించును. అదియెట్టులన:- జ్వరము,తాపము వలన రక్తసిక్తము కల్గును. రక్తసిత్తమువలన ఒకవేళ జ్వరము కూడ కల్గును. ఆరెండిటిచేత శోషమును కల్గును. ప్లీహము వృద్ధినొంది మహోదరమును కల్గించును.