పుట:Madhavanidanamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్టి పూర్వరూపము సామాన్యమనియు విశేషమనియు రెండు తెరంగులు. రోగములు జనించుటకు మున్ను దోషములు రసాదులుజేరిలు వ్యాధించునపుడు వాతాదులకు సంబంధించిన లక్షణములుగాక జ్వరాదులకు సాధారణములైనశ్రమము, ఆరతి, ఆలస్యము మున్నగునవి సామాన్య పూర్వరూపము. అయ్యది "శ్రమోంరతి ర్వివర్ణ క్వం" ఇది మున్నగు వాక్యములచే జెప్పబడినది.

మరియు జ్వరాదిరోగములు కల్గుటకు ముందు రానున్నవ్యాధికి వాతాది సంబంధములచే గల్గులక్షణములను మిగుల సూక్ష్మ్ముగ దెలుపునది విశేషపూర్వరూపము. అయ్యది, "జృంభాత్యర్ధం సమీరణాత్: పిత్తాన్నయనయోర్ధాహ:, కఫాదన్నారుచి స్తధా" ఇవి మున్నగువాక్యములచే జ్వరాది ప్రకరణముల యందు మూలముననే స్ఫుటంగును.

వ్యాధి జనించుటకు సిద్ధముగ నున్నదనియు, రానున్నవ్యాధి యియ్యది యనియు సమాన్యముగదెలుపునట్టిశ్రమము ఆలస్యము మున్నగునవి సాకాన్యపూర్వ రూప మనియు రానున్నవ్యాధియొక్క స్వభావమును, దానికింగల వాతాది సంబంధ విశేషమును దెలుపునట్టి (కండ్లుమంట, అన్నరుచి, ఆవలింతలు మున్నగు) విశేష్లక్షణములు విశేషపూర్వరూప మనియు నిర్ణయము. ఈవిషయము తంత్రాంకరమున నిట్లు చెప్పబడినది:-- "వ్యాధేర్జాతిర్భుభూషా చ పూర్వరూపేణ లక్ష్యతే, భావ: కిమాత్మ కత్వం చ లక్ష్యతే లక్షణేన్ హి."

రూపలక్షణము

తదేవ వ్యక్తతాం యాతం రూపమిత్యభిధీయతే, సంస్థానం వ్యఞ్జం లిజ్గుం లక్షణం చిహ్న మాకృతి:.

పైజెప్పబడిన పూర్వరూపము అన్యక్తముగ గాకస్ఫుటముగ గానవచ్చినచో నయ్యది రూప మనంజను అయ్యది సంస్థానము, వ్యంజనము, లింగము, లక్షణము, చిహ్నము, ఆకృతియు నను పర్యాయ శబ్ధములచే నీ యాయుర్వేద తంత్రముల యందు వ్యవహరింపబడును. వాతాదిజ్వరములను అంభుటముగ దెలియంజేయు లక్షణములు పూర్వరూప మనియు అట్టి వాతాది సంబంధ భేదముతో గూడిన జ్వరమును స్ఫటముగ దెల్పు లక్షణములు రూప మనియు నీ రెంటికిని భేదము నెరుంగునది. మరియు రాబోవు వ్యాధిని దెల్పునది పూర్వరూపము. వ్యాపించిన వ్యాధిస్వరూపమును స్ఫుటముగ దెల్పునది రూపము నని కొంద రాచార్యులు చెప్పిది. ఎట్టులన--- "ఉత్పన్నవ్యాధిబోధకమేవ లింగం రూపమ్" అను వాక్యమున చెప్పిరి.