పుట:Madhavanidanamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"చత్వారో దూర నికట ప్రాధానికత్వా త్పునస్తేంసాత్మ్యేనింద్రియకార్ధయక్పరిణితి ప్రజ్ఞాపరాధాత్త్రిధా. రుగ్దోషోభయమారణాదసి తధా, ద్వౌ వ్యన్జుకోత్పాదకా బాహ్యాభ్యంతరభేదతోంసి కధితా: హేతో: ప్రభేదా అమీ, దోష్య చ ప్రాకృతవైకృతాభ్యాం భేదోంనుల ధ్యాదపి చానుబంధాత్, తధాప్రకృత్యప్రకృతిత్వయోగాత్తధాశయాకర్షవశీర్గతేశ్చ." వ్యాధికి ఉత్పత్తి కారణమైన హేతువు వ్యభిచారి, సన్నికృష్టము, నిప్రకృష్టము, ప్రాధానికము నని నాల్గుభేదములు తొలుత జెప్పబడినవి. పిదప నసాత్మ్యేనింద్రియార్ధ సంయోగము, ప్రజ్ఞాపరాధము, పరిణామమునని మూడు భేదములును; వ్యాధికిని, దోషమునకును, వ్యాధిదోషముల రెంటికిని కారణము లగుటంజేసి మూడుభేదములును, వ్యంజక, ఉత్పాదకములను రెండు భేదములును బాహ్యాభ్యంతరభేదములును బాహ్యాభ్యంత భేదములచే రెండువిధంబులును చెప్పబడినవి. ఇత్తెరంగున నన్నియు కలిసి హేతువుయొక్క భేదములు పదునాల్గు తరంగులు.

దోషములు ప్రాకృతవైకృత భేదములచే రెండువిధములును, అనుబంద్య - అనుబంధ భేదములచే రెండుతరంగులును బొక్కటియు; చరకమున జెప్పిన గతిభేదములచే తొమ్మిది విధంబులును, అన్నియు కలిసి పదునారుభేదములం కల్గియుండును. (ఇదియ నిదాన లక్షణవివరణము)

పూర్వరూపలక్షణము

                          ప్రాగ్రూపం యేన లక్ష్యతే, 5
             ఉత్పిత్సురామయో దోషవిశేషణాంనధిష్టిత:,
             లింగసమవ్యక్తమల్పత్వాద్వ్యాధీనాం తద్యధాయధం, 6

వ్యాధి జనించుటకు తగిన మిధ్యాహారాదికారణములు గల్గియుండుటంజేసి రాను సిద్ధముగ నున్న రోగము దోషవిశేషలక్షణములు వ్యాపించకుండునపుడు, అట్టి రానున్నరోగమును తెలియపరచుక్రమము, ఆలస్యము, ఆరతి మున్నగు లక్షణములు, అప్పుడు రానున్న వ్యాధికి పూర్వరూప మనబడును. (దోషములచే పూర్తిగ వ్యాప్తి జెందక తనయొక్క లక్షణములు కొంచెముగ నుండు వ్యాధి ప్రారంభదశను దెలుపు లక్షణములు పూర్వరూప మనుట) అట్టి పూర్వరూపము రానున్నవ్యాధి బలిష్టముగా నుండుటజేసి, అట్టివ్యాధికి సూక్ష్మమైస్ఫుటముగానుండు లక్షణమైయుండును. అయ్యది ఆయావ్యాధికి సంబంధించి వేరువేరుగనుండును. ఆయావ్యాధి సూక్ష్మ లక్షణములబట్టి రానున్నవ్యాధి ఇయ్యది యని తెలియ వలనుపడుటకై పూర్వరూపము జెప్పబడినది.