పుట:Madhavanidanamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియు ననుబంధ్యానుబంధముల అమనించుతరి యాశయాపకర్షముచే నను బంధత్వమును గమనించవలెను. ఆశయాసకర్షమున--వాతము ప్రకోపము నొందినపుడు తమతమ స్థానముల యందున్న కఫసిత్తములను వానిస్థానములనుండి తొలగించి శరీరమునందెల్ల వానిని దీసికొని వ్యాపించుతరి అచ్చటచ్చట పిత్తకఫములకు సంబంధించిన పోటు నొప్పి మంట మున్నగు నుపద్రవములు కల్గును. ఇచ్చట వాతము స్వస్థానమున ప్రకోపము లేకుండును. తక్కిన దోషములను బలాత్కారముగ దీసికొని స్థానంతరమునకు పోవుటచే బాధలు కల్గించిల్గాని పిత్తాదులు ప్రకోపించలేదు. కావున నట్టి సమయమున వాతము ప్రధానమై తక్కిన పిత్తకఫములు అనుబంధములని యూహించునది. అట్టియెడ వాతమునకు దగిన చికిత్స జేయవలెనుగాని తక్కిన దోషములకు భ్రమసి ప్రధానచికిత్స జేయజనదు ఇది ఆశయాపకర్షము. ఈ విషయమును చరజాచార్యుడిట్లు చెప్పెను:--"ప్రకృతిస్థం యదా పిత్తం మారుత: శ్లేష్మణ:క్షయే, స్థానాదాదాయ గాత్రేషు యత్ర యత్రప్రసర్పతి, తదా భేదశ్చ దాహశ్చ తత్ర తత్రానస్థితం: గాత్ర దేశే భవత్యస్యక్రమో దౌర్బల్యమేన చ" (చరక. సూ.అ.17) ప్రకోపించినదోషము స్వస్థానమున నుండు దోషమును బలాత్కారముగ తొలగించి వ్యాపింపజేయుట యాశయాసకర్ష మని భావము.

మరియు వాతాదిదోషములకు గతి విశేషములకు గతివిశేషమున గల్గు భేదముల గమనించుట ముఖ్యమైనది. చరకాచార్యుడు దోషములుగతిభేదమును ఇట్లు చెప్పెను:--"క్షయ: స్థానం చ వృద్ధిశ్చ దోషాణాం త్రివిభాగతి:, ఊర్ధ్వంచాధశ్చ తిర్యక్చవిజ్ఞేయా త్రివిధాసరా, త్రివిధాచాపరాకోష్ఠశాఖామర్మాస్థిసంధిషు" ( చరక. సూ. అ.17)వాతాది దోషములయొక్క, గతులు క్షయము, స్థానము, వృద్ధియు నని మూడు విధములు. అందు క్షయ మన తగ్గియుండుట, వృద్ధిక్షయములు లేక తమతమ స్థానముల యందయుండుట స్థానము, అధికముగ వృద్ధినందుట వృద్ధి. మరియు నవి శరీరమున పైకిని క్రిందికిని అడ్డముగను వ్యాపించునని మూడు గతిభేరములు. శాఖలు (రక్తాదులు త్వక్కులు)యందుకు, కోష్ఠమునందును, మర్మములయొక్కయు, ఆస్థుల యొక్కయు, సంధులయందును సంచరించుగతిభేదములు మూడు. ఇత్తెరంగున వాతాది దోషముల గతిభేదములు తొమ్మిదివిధముల నుండు;ను. అట్టి గతిభేదములబట్టి చికిత్స భిన్నభిన్నముగ నుండును. కావున వాని గరిభేదముల గమనించుట యావశ్యకము. వీనికి ప్రత్యేక ప్రయోజనము ఆయాచికిత్సాప్రకరణముల విపులముగ నుండును గాన నిచ్చట విడుంపంబడును.

పైజెప్పబడిన రోగహేతువు యొక్క భేదములను, దోషములయొక్క భేదములను సంగ్రహముగ నొక్కెడ దెలియుటాకై ప్రాచీనులు సంగ్రహశ్లోకముల నిట్లు చెప్పిరి:--