పుట:Madhavanidanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండునది వ్యంజకము. హేమంతమునబుట్టిన మధురరసము వసంతమున కఫరోగమును కల్గించును. ఇది కఫరోగమునకు ఉత్పాదకము. అట్టి వసంతఋతువున సూర్యునితాపముచే కఫము కరుగును. ఈసూర్యతాపము వ్యాధిని కల్గించకున్నను వ్యాధికి కారణమైన కఫము కరగించి సహకారి యగును కావున సూర్యతాపము వ్యంజక మగును.

మరియు నాహేతువు బాహ్యమనియు, అభ్యంతరమనియు రెండువిధములు. అందు ఆహారవిహారాచారాదులు బయటనుండి కల్గినకారణము లగుటంజేసి బాహ్య హేతువులు. అయ్యని వాతాదుల ప్రకోపింపజేయు వ్యాయామాదులు.

వాతాది దోషములును, రసరక్తాది దూష్యములును శరీరాంతర్భాగమున నుండుటంజేసి యాభ్యంకర హేతువులు. అందు వసంత ఋతువునందు శ్లేష్మంబును, శరదృతువు నందు పిత్తంబును, వర్షఋతువు నందు వాతంబును ప్రకోపించుట ప్రాకృతము. వసంత ఋతువున ప్రకోపించిన వాతపిత్తంబులును, వర్షఋతువున వైకృతములు. అట్టి ప్రాకృతవైకృత భేదములచే సుఖసాధ్యత్వాదుల గమనించుట ప్రయోజనము. ఈవిషయమును చరకాచార్యుండిట్లు చెప్పెను:-- "ప్రాకృతస్సుఖసాధ్యస్తు వనస్తశరదుద్భ:" (చరక. చి.అ.3) వసంతశరదృతువులబుట్టిన ప్రాకృతదోషము సుఖసాధ్యమని భావము.

మరియు వాతాదిదోషములు అనుబంధ్యము లనియు, అనుబంధము లనియు రెండు విధములు అందు రోగమునకు ప్రధానకారణముగ నుండునది అనుబంధ్యము. ప్రధానముగాక ప్రధానము ననుసరించి యుండునది అనుబంధము. ఈ విషయమును చరకాచార్యుం డిట్లు చెప్పెను:--"స్వతంత్రోన్యక్తలిజ్గో యధోక్తసముత్ధానోపదశమో భవత్యనుబంధ్య:, తద్విపరీతలక్షణస్త్వమనుబంధన:" (చరక.చి.అ.6) స్ఫుటములగు స్వలక్షణములతో గూడి యధావిధిగ నుత్పత్తియు, శాంతియు కల్గి స్వతంత్రముగ వ్యాధిని గల్గించునది యనుబంధ్యము. అటుగాక తనలక్షణములు స్ఫుటముగ తెలియక ప్రధానదోషమునకు సహకారిగనుండునది యనుబంధము. ఈయనుమంధ్యాను బంధములు దెలిసినచో దోషసంసర్గజనిత వ్యాధులయందు అనుబంధముగ నుండు దోషమునకు విరొధము;లేక యనుబంధ్యమునకు దగిన చికిత్స చేయుటకు సుకరముగ నుండును. ఇదియు దీని ప్రయోజనము.

మరియు ప్రకృతి నికృతి భేదముచే దోషములు రెండువిధములు. అందు వాతప్రకృతి కలవానికి వాతరోగము జనించినచో నసాధ్యము. కఫప్రకృతికలవానికి కల్గిన వాతరోగము సుఖసాధ్యము. దూష్యములగు రసరక్తాదులును, దోషములగు వాతాదులును, మనుజుల యొక్క ప్రకృతికి సమాన గుణములుగాక యున్నచో నావ్యాధి సుఖసాధ్య మగు నని చరకాచార్యుం డిట్లు చెప్పెను:--"స.చ తుల్యగుణోదూష్యో న దోష: ప్రకృతిర్భవేత్" (చరక.సూ.అ.10)