పుట:Madhavanidanamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వరూపమును జెప్పినపిదప, పూర్ణముగ లక్షణములతో గూడి జనించిన వ్యాధిస్వరూపలక్షణములు దెల్పు రూపమును జెప్పుటకుమున్ను వ్రాధిస్ంభదించు క్రమమును దెలుపుసంప్రాప్తిని చెప్పుట సమంజసము, అయినను వ్యాధిస్వరూపము పూర్తిగ దెలియుటకై రూపమును జెప్పెను.

ఉపశయలక్షణము

హేతువ్యాధినిపర్యస్త విపర్యస్తార్ధకారిణాం, ఔషధాన్నవిహరాణాం ఉపయోగం సుఖావయ్, విద్యాదుపశయం వ్యాధే: సహిసాత్మ్యమితి స్తృతు:,

ఆయావ్యాధికి జెప్పినహేతువునకు, వ్యధికి హేరువ్యాధులకు రెండిటికిని విరుద్ధములై శరీరమునకు వ్యాధియొక్క శమనరూపమై సుఖమును గల్గించు ఔషధముల యొక్కయు, అన్నములయొక్కయు, విహారములయొక్కయు నుపయోగము ఉపశమనంబడును. మరియు అట్టిహేతువునకైనను, వ్యాధికినైనను, హేతువ్యాధుల రెండిటికైనను విపరీతములు గాకున్నను, విపరీతముల నుపయోగిచినప్పుడు కల్గునట్టివ్యాధి శమనరూపకార్యమునుచేయు ఔషధములయొక్కయు, అన్నముల యొక్కయు, విహారములయొక్కయు, శరీరమునకు సుఖకరమైన యుపయోగముగూడ నుపశయమనబడును ఇదియే సాత్మ్య మనియు జెప్పనగును.

ఈ పాత్మ్యలక్షణమునే ఇతరతంత్రకరు లిట్లు చెప్పిరి:--"దేశానమామయానాం చ విపరీతగుణం గుణై: పర్మ్యమిచ్చనింతసాత్మ్యజ్ఞా: చేష్టితం చాద్యమేవచ" జంగలాది దేశములకును, జ్వరాదిరోగములకును విరుద్ధంబులైన గుణములుకల ఔషధములు, అన్నములు, విహారములు మున్నగునవి క్రమముగ దేశసాత్మ్యములనియు, వ్యాధిసాత్మ్యములనియు వచించెదరు.

పైజెప్పిన యుపశయలక్షణము నిట్లు విసదముగ నెరుంగునది;-- వ్యాధిజనకంలగు హేతువులకైనను, జ్వరాదరోగములకైనను, గ: రెంటికైనను విరుద్ధములగు గుణములు కల్గిన ఔషధములకైనను, అన్నములకైనను, విహారములనైనను ఉపయోగించుట ఉపశయము. అట్టి హేతు, వ్యాధి, హేతువ్యాధులు అను నీమూడిటికినివిపరీతగుణములు కాకున్నను విపరీతగుణములు గలవానివలె వ్యాధినివృత్తిరూప కార్యమును కల్గించు ఔషధ-అన్న-విహారముల నుపయోగించుటా ఉపశయ మనబడును. అట్టి యుపయోగము వ్యాధి నివృత్తిరూపమైన సుఖమును గల్గించునదిగ నుండవలెను అని ముఖ్యభావము.

మరియు తంత్రాంశరమున "సుఖానుబందో యో హెతు: వ్యాధ్యాదివిపరీతక:, దేశాదికశ్చోపశయ: జ్ఞేయోంనుపశయోం న్యధా" అని చెప్పబడినది గాన నిచ్చట