పుట:Madhavanidanamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ వెడలించుట మున్నగునవి మిధ్య్తాయోగము. ఇది కాయిక కర్మలకు సంబంధించిన అయోగ - అతియోగ - మిధ్యాయోగములు. తక్కిన వాచిక మానసిక కర్మలకును అయోగాదుల నిత్తెరంగుననే యూహించునది. మరియు లోకాంతరమున జేయబడిన కర్మకుని మిధ్యాయోగాదుల నిట్లూహించునది. ఇదియే ప్రజ్ఞాపరాధమునకు సంబంధించిన అయోగ - అతియోగ - మిధ్యాయోగములు. దీనిని వాగ్భటాచార్యు డిట్లు చెప్పెను:-- "కాయవాక్చిత్తభేదేన కర్మాది విభజేత్రిధా, కాయాదికర్మణాం హీనా ప్రవృత్తిర్హీనమాజ్ఞతా, అతియోగోంతి దీప్తిస్తు వేగోదీరణధారణం."

ఇట్టిభేదములుకల నిదానముచే వాతాదిదోషములు ప్రకోపమునొంది యనేక విధములగు రోగములు కల్గించును. ఈవిషయమును వాగ్భటాచార్యు డిట్లు చెప్పను:- 'నిదానమేశద్దోషాణాం కుడితాస్తేం: నైకధా, కుర్వంతి నివిధాన్ రొగాన్."

అట్టి నిదానము వాతాది దోషప్రకోపమునకును వ్యాధిని రెంటికిని కారణమగుటవలన మూడువిధము లగును. ఆయా ఋతువులయందు పుట్టిన మధురాదిరసములు దోషములు దోషములయొక్క చయప్రకోసప్రశయములకు కారణములగును. ఇద్ కేవలము దోషములకే కారణము.

పాండురోగనిదానమున "న ఇచ్చామో భక్షణాన్మృద:' అని చెప్పుటచేత మృత్తును తిన్నప్పుడు పాండురోగము గల్గు నని తెలియుచున్నది. ఇచ్చట పాండురోగమునకు మృద్భక్షణము కారణము. కావున నిది రోగమునకు నిదానము. మరియు "కషాయా నూరుతం పిత్త మూషరా మధులా కఫమ్" (చరక. చి.ఆ.16) అను చరకవాక్యము ననుసరించి మృత్తు వాతాదిప్రకోపమునకూడ కారణమగునుగాని మట్టిని తినుటచే ప్రకోపించినదోషముచేత పాండురోగముదక్క వేరొండురోగము గల్గదు. కావున మృద్భక్షణము పాండురోగమునకు హేతువగుట నిక్కము.

మరియు "హస్త్యశ్వోష్ట్త్రై ర్గచ్ఛకశ్ఛాశ్నతశ్చ../ ఉచ్యతే వాతరక్తం" (సుశ్రుత.ని.అ.1.) అని వాతరక్తము కల్గునని యర్ధము. అట్టిల్ సవారి చేయుటచేత వాతాదులు ప్రకోపించును. రక్తము చలించి పాదములయందు చేరును. కావున వాతాది ప్రకోపమునకును రక్తము పాదములజేరుస్వరూపము కలవ్యాధికిని ఆశ్వాధియానము కారణమగును. కావున ఇయ్యది దోషములకును వ్యాధికిని కారణమగు నిదానము. ఇట్టి స్థలములయందు హేతువునకు వ్యాధికిని గూడ శామకమగు చికిత్సజేయవలెను. దీనికే ఈవిషయము ముఖ్యముగ గమనించుటకై యిచ్చట వివరింపబడినది.

మరియు పైజెప్పబడిన హేతువు ఉత్సాదకమనియు, వ్యంజకమనియు రెందు తెరంగులు. వ్యాధిని పుట్టించునది యుత్పాదకము. వ్యాధినిపుట్టించకున్నను సహజ 'రిగ