పుట:Madhavanidanamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రియములకు తమకు సంబంధించిన విషయములందు బొత్తిగ సంబంధము కల్గకుండుట అయోగము. అధిగముగ సంబంధము కల్గియుండుట అతియోగము, విరుద్ధముగ సంబంధము కల్గుట మిధ్యాయోగము.

అందు నేత్రములకు తనకు సంబంధించిన రూపములను జూడకున్నచో నయోగము రూపాదులను విశేషముగ నెడతెగక చూచుచున్న సతియోగము; మిక్కిలి సూక్షమంబును, భయంకరంబును మిక్కిలి కాంతియుక్తములు నగు సూర్యుడు మున్నగు రూపముల జూచుట ఇవి మున్నగునవి మిధ్యాయోగము. ఇది చక్షురింద్రియమునకు సంబంధించిన మిధ్యాయోగము. ఇత్తెరంగుననే తక్కిన యింద్రియములకు ఇంద్రియార్ధములతో నయోగ - అతియోగ - మిధ్యాయోగముల నూహించునది. ఇదియు యసాత్మ్యే నిద్రియార్ధ సంయోగ భేదములు. ఈవిషయమును వాగ్బటాచార్యుడిట్లు చెప్పెను:-- హీనోంర్థే నేంద్రియస్వాల్పస్సంయోగ స్వ్యేన నైనవా అతి యోగొంతి సంసర్గ:, సూక్ష్మభాసుసురభైరవం, అత్యాసన్నతిదూరర్ధం విప్రియం వికృతాది చ, యదక్ష్ణా వీక్ష్యతే రూపం మిధ్యాయోగస్ప దారుణకి, ఏవనమత్యుచ్చ పూత్యాదీ నింద్రియార్దం యధాయధం, విధ్యాత్."

కాలము శీతము, ఉష్ణము, వర్షము అను మూడిటిచే మూదు విధముల నుండును. అందు హేమంతశశిరములు శీతకాలములు. వసంతగ్రీష్మములు ఉష్ణకాలము. వర్షఋతువు వర్షాకాలము. ఇందు శీతకాలమున చల్లదన ముండావలెను. అట్టికాలమున శీతము స్వల్పముగ నునచో కాలమునకు హీనయోగము. శీతము మిక్కుటముగ నున్న సతియోగము. శీతము బొత్తుగలేక ఉష్ణం బధికముగనున్న వింధ్యాయోగము. (ఇదియే ఋతుధర్మవైపరీత్యము.) ఇత్తెరంగునననే తక్కిన కాలములకును అయోగ - అతియోగ - మిధ్యాయోగముల నిర్ణయించునది. ఈ విషయమును వాగ్భటాచార్యుడిట్లు చెప్పెను:--"కాలస్తు శీతోష్ణవర్ష భేదాత్త్రిధా మక:, స హీనో హీనశీతాది: అతియోగోంతిలక్షణ:, మిధ్యాయోగస్తు నిర్ధిష్టో విపరీతస్య లక్షణ:" ఇదియే పరిణామమునకు హీనమిధ్యాతియోగములు.

కర్మము, శరీరము, వాక్కు, మనస్సు అను మూడిటి సంబంధమును బట్టి మూడువిధములు. ఈ మూడిటికిని సంబంధించిన పనుల బొత్తుగ జేయకుండుట అయోగము. అట్తిపనులను మితిమీఱిచేయుట అతియోగము. విరుద్ధచేష్టలుచేయుట మిధ్యాయోగము. దేహపరిశ్రమము మున్నగు కృత్యములను బొత్తుగ జేయకుండుట శరీరకర్మకు అయోగము. వాని నధికముగజేయుట యతియోగము. మలమూత్రాదులు వెడలనున్నపుడు వాని నిరోధించుట, వానివేగము లేని సమయమున బలాత్కార