పుట:Loochupu-fr.Jojayya.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లల మనస్తత్వం వేరు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల మనస్తత్వం వేరు. విద్యాసంస్థల్లోని పిల్లలను పరీక్షిస్తే చాలు, యూ సత్యం వెంటనే తెలిసిపోతుంది.

ఈ విధంగా వంశానుగతమైన గుణాలూ, పరిసర ప్రభావాలూ మన జీవితాన్ని మారుస్తాయి. మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. ఒకే జాతి మామిడి మొక్కలు రెండింటిని తీసికొని ఓదాన్ని చవిటి నేలలో నాటాం. మరోదాన్ని కండగల నేలలో నాటాం. చెట్లయ్యాక వాటి రెండింటికీ ఎంత వ్యత్యాసం కన్పిస్తుంది! యీలాగే వంశానుగత లక్షణాలూ పరిసర ప్రభావాలూ మన బాగోగులకు కారణమౌతాయి.

కొందరు దరిద్రపు పరిసరాల్లో పుట్టిగూడ గొప్పవాళ్లయ్యారు. లాలు బహుదూర్ శాస్త్రి పేదకుటుంబంలో పుట్టాడు. రోజూ మైళ్ల దూరం నడచి, ఏళ్లు దాటి బడికి వెళ్లేవాడు. ఐనా అతడు భారతదేశపు రెండవ ప్రధాని కాగలిగాడు. అబ్రహామ్ లింకను తండ్రి అడవుల్లో కట్టెలు నరకేవాడు. ఐనా లింకను అమెరికాను పరిపాలించిన గొప్ప అధ్యక్షుల్లో ఒకడు. కాని ఇలాంటి జీవితాలు చాలా అరుదైనవి. మామూలుగా మనమందరమూ పరిసరాల ప్రభావాలకు లోనయ్యేవాళ్లమే. అంచేత మన పిల్లలకు చిన్న నాటి నుండే చక్కని పరిసరాల ప్రభావం కలిగిస్తుండాలి.

4. సమాజం

నరేంద్రరెడ్డి, జితేంద్రరెడ్డి హాస్టల్లో ఒకే గదిలో వుంటారు. నరేంద్రరెడ్డి ధనికులబిడ్డ విలువగల దుస్తులతో విలాసంగా కారుల్లో తిరుగుతుంటాడు. జితేంద్రరెడ్డి పేదవాడు. కాని అతడు నరేంద్రరెడ్డిని చూచి మోజుపడతాడు. తానూ అతనిలా దర్జాగా హోదాగా జీవించాలని ఉబలాటపడతాడు. ఈలా ధనికవర్గం పేదవర్గానికి కొన్ని విలుల నందిస్తుంది. మనమూ ఆ వర్గంలో చేరాలనుకుంటాం. మనం గ్రహించినా గ్రహించకపోయినా, మననాటి సమాజం మన వ్యక్తిత్వాన్ని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. సమాజం ఓ వైపు చెడ్డ విలువలను నేర్పుతుంది. పై యుధికారులు క్రింది యుధికారులకు లంచగొండితనమూ, అధికారం చెలాయించడమూ, బంధుపక్షపాతమూ మొదలైన చెడ్డవిలువలు నేర్పుతారు. వీనిని మనం (4)