పుట:Loochupu-fr.Jojayya.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహించకూడదు. ఇక కష్టపడి పనిచేయడం, అర్హత కొద్దీ ఉద్యోగాలు ఆశించడం మొదలైన మంచి విలువలూ వుంటాయి. వీనిని మనం గ్రహించాలి. 5. బడి, కాలేజి మనం చదువుకున్న బడి, కళాశాల కూడా మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. ప్రసాదు నాస్తికుల పాఠశాలలో చదువుకున్నాడు. అతనికి దేవుడు లేడు, నైతిక విలువలు లేవు అనే భావాలు జీర్ణమయ్యాయి. కనుక దేవుణ్ణి నమ్మడం మానేశాడు. రఘు మిషన్ స్కూల్లో చదువుకున్నాడు అతడు భగవంతుని నమ్మడం నేర్చుకున్నాడు. అనుదినం ప్రార్ధన చేసికుంటాడు. అతని మనస్తత్వం వేరు.

సుగుణ చదువుకునే కాలేజీలో లీడర్షిప్ క్యాంపులు వున్నాయి. ఆ బాలిక వాటికి హాజరై చక్కని నాయకలక్షణాలు అలవరచుకుంది. తరువాత సమాజంలో నాయకత్వం వహించడం నేర్చుకుంది. కరుణ చదువుకున్న కాలేజీలో ఇవేమీ లేవు. ఆమె చిన్ననాటి పిరికితనం పోగొట్టుకోలేదు. పెండ్లయి సంతానవతి ఐనా కూడా సమాజంలోనికి రాలేదు. సిగ్గుతో భయంతో ఇంట్లోనే వుండిపోతుంది. ఈలా మనం చదువుకునే విద్యాసంస్థలు మనకు కొంత తర్ఫీదునిస్తాయి. మన ఆశయాలు, ఆదర్శాలు కొంతవరకైనా మనం చదువుకునే విద్యాసంస్థలనుబట్టి వుంటాయి. తరువాత ఈ యాదర్మాలే మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. 6.

6.లింగభేదం

ఆడు, మగ అనే లింగభేదం మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. పద్మకు పదునెన్మిదేండ్లు. చాల అలంకరణ ప్రియ. ఒడలు తీగలావుంటుంది. ముఖంలో ఆకర్షణా సిగూ దొంతరలాడుతూంటాయి. ప్రకృతి ఆమెను తల్లిని చేయబోతుంది. కనుక ఆమె వ్యక్తిత్వం మాతృధర్మానికి తగినట్లుగా వుంటుంది. రాజుకు ఇరవైయైదేండ్లు. పుష్టిమంతమై కండలు తీరినదేహం. లేడిలాగ చంగున దూకుతుంటాడు. కొంత బడాయి, గర్వమూ వున్నాయి. గొప్పవాణ్ణి కావాలనే కోరికలు ఈరికలెత్తుతుంటాయి. అధికార వాంఛ

(6)