పుట:Loochupu-fr.Jojayya.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే మానవ స్వభావం కూడాను. విమల, అమల స్నేహితురాళ్లు. విమలది చిరునవ్వు మొుగం. ఆ యమ్మాయి యెప్పడూ ఉల్లాసంగా వుంటుంది. బేడిస చేపలా దుముకుతూంటుంది. అయినా పెద్ద నిశితదృష్టి కలదిగాదు. అమలది కొంచెం విచార మొహం. ఆ యుమ్మాయి ఎగిరిపడినట్లుగా వుండదు. నిబ్బరంగా వుంటుంది. కాని చాల లోతుతనం కలది. ఈ రెండు స్వభావాలు పరస్పర భిన్నాలు. ఐనా ఇవి రెండూ వంశపారంపర్యంగా వచ్చినవే. ఈలా చాలా గుణాలు వంశపారంపర్యంగా సంక్రమించి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఈ గుణాలు మన యిష్టం మీద ఆధారపడి ఉండవు. కాని మనం వీటిని కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చు.

ఇక పరిసరాలనుబట్టి వచ్చే లక్షణాలను విలోకిద్దాం - Environment. లత, లలిత విద్యార్థినులు. ఒకే ఊరినుండి వచ్చినవాళ్లు లత పెద్ద ఉద్యోగస్తుల బిడ్డ ఆ యమ్మాయి చక్కని సంస్కృతి అలవరచుకొంది. లలితంగా నాట్యం చేస్తుంది. ఆటపాటల్లో అలంకరణల్లో పాల్గొంటుంది. గేయకవిత్వం చదువుతూంటుంది. లలిత రైతుబిడ్డ. పెద్ద నాగరికత యేమీ అలవడలేదు. మొరటుగా మాటలాడుతుంది. నాజూకుగా మెలగడం చేతకాడు. శీలాన్ని బట్టి చూస్తే, లత, లలిత ఇద్దరూ మంచిపిల్లలే. కాని వాళ్ల వ్యక్తిత్వంలో ఎంత భేదం! ఈ భేదానికి కారణం వాళ్లు పెరిగిన పరిసరాలే.

శీతోష్ణాలూ ప్రకృతి పరిసరాలూ మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. శీతల దేశాల్లో పుట్టినవాళ్ల చర్మం తెల్లగా వుంటుంది. వాళ్లు చైతన్యంగా వుంటారు. ఉష్ణదేశాల్లో పుట్టినవాళ్ల చర్మం నల్లగా వుంటుంది. వాళ్లకు చైతన్యమూ, ఉత్సాహమూ అంతగా ఉండవు.

సంస్కృతీ, మతమూ మన వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. లలిత కళాజ్ఞానమూ, పారిశ్రామికాభివృద్ధి మన జీవితాన్ని మార్చివేస్తాయి. అలాగే మతభావాలూ, నైతిక సిద్ధాంతాలు కూడాను.

సాంఘికవ్యవస్థ మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. మన దేశంలో అగ్రకులాలు కొన్నీ వెనుకబడిన కులాలు కొన్నీ అగ్రకులాల్లో పుట్టిన