పుట:Loochupu-fr.Jojayya.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3.బడిలో పిల్లలకు హైన్యభావాలు కలిగే తీరును వివరించండి? 4.పెద్దకులాలవాళ్లు మిమ్మెప్పడైనా చిన్నచూపు చూచారా? కులాన్ని కారణంగా తీసికొని మిమ్మెవరైనా కేటాయించారా? 5.ఒడలిరంగు, ఆకారము, దుస్తులూ - ఇవి యువతకు హైన్యభావాలు కలిగిస్తాయా? వివరించండి. 6.ఆత్మాంగీకారంవల్ల హైన్యభావాలు తొలగించుకోవడం ఏలా? 7.మహాపురుషుల జీవిత చరిత్రలు, బహిర్ముఖత్వం, హాస్యప్రియత్వం హైన్యభావాలను జయించడానికి ఏలా సాయపడతాయి? 8.హైన్యభావాలను సవరించుకోవడానికి పిల్లలకు విద్యా సంస్థల్లో ఏమి అవకాశాలు దొరుకుతాయి?

10

1.మనోభావాలు మనకు ఏమి చేసిపెడతాయి? 2.భావసంయమనం అంటే ఏమిటి? 3.ఇతరులను జయించవచ్చుగాని మనలను మనం జయించుకోలేం ఎందుకు? 4.రామారావు ధనప్రియుడు. సుబ్బారావు అధికారప్రియుడు.వెంకటరావు భోగక్రియుడు. వీళ్లకు ధనంవల్లా, అధికారంవల్లా, భోగం వల్లా సంతృప్తి కలుగుతుందా? వీళ్లు ఆత్మశాంతిని అనుభవించాలంటే ఏమిచేయాలి? 5.మగవాళ్లలో కంటె ఆడవాళ్లలో మనోభావాలు తీవ్రంగా పనిచేస్తాయి. ఎందుకు? 6.కోపంగానో విచారంగానో వున్నపుడు మనం ఆ మనోభావాలు నడిపించి నట్లల్లా నడుచుకోవచ్చా? ఎందుకు?