పుట:Loochupu-fr.Jojayya.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3.అపమార్గంలో లోపపూరణం చేసికోవడానికీ మంచి ధోరణిలో లోప పూరణం చేసికోవడానికీ తేడా ఏమిటి? 4.సరస్వతి కొత్తగా అత్తగారింటికి కాపురానికి వెళ్లింది. ఆమె తన సొంత వూరిని గూర్చి చాల గొప్పగా చెప్పకొంటుంది. ఆమె ఏ రక్షణమార్గాన్ని అవలంభించినట్లు? 5.ఈ యధ్యాయంలో వర్ణింపబడిన ఆరు రక్షణమార్గాల్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఆశ్రయించేవి యేవి? కొన్ని ఉదాహరణలు ఈయండి.

8

1.నరులు ఆధిక్య భావాలను ఎందుకు ప్రదర్శిస్తారు? ఈ భావాలు కల వాళ్లను సమాజం గౌరవిస్తుందా? 2.ఊర్మిళ యెగతాళి యితరులకు బాధ కలిగిస్తుంది. సావిత్రి ఎగతాళి ఇతరులకు బాధ కలిగించడు. ఈ యిద్దరి యొగతాళికి భేదం ఏమిటి? 3."పండితుడు పండితుణ్ణి చూచి కుక్కలా మొరుగుతాడు" ఎందుకు?

4.సుందరమ్మ మా పిల్లలు అందరిపిల్లల్లాగ వీధులవెంట తిరిగే రకం కాదు" అని చెప్తుంది. ఆమె ఉద్దేశం? 5.ఈపాఠం లో చెప్పినవిగాక యింకా మీకు తట్టిన ఆధిక్య భావాలు కొన్ని తెలియజేయండి. నీవే ఉపాధ్యాయుడవైతే ఆధిక్యభావాలను అణచివేసికోవాలని పిల్లలకు ఏలా బోధిస్తావు?

9

1.లోపాలున్న వాళ్లందరికీ హైన్యభావాలు కలుగుతాయా? 2.మామూలుగా చిన్నపిల్లల్లో కన్పించే హైన్యభావాలు ఏమిటివి?