పుట:Loochupu-fr.Jojayya.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదట ఓడిపోయికూడ పట్టుదలతో కృషిచేసి పైకివచ్చిన వాళ్లను కొంతమందిని ఉదాహరించండి. మీ సొంత భయాలేమిటివో ఓ జాబితాగా వ్రాసుకోండి. వీటిల్లో ఎన్ని యథార్థంగా సంభవించాయి? కనుక వీటిని మీ జీవితంలో నుండి తొలగించుకోవద్దా? భగవంతుడు ఓ పోలీసులాంటివాడు మనలను పట్టుకొని శిక్షిస్తాడు అని భయపడ్డం మేలా, లేక ఓ తండ్రిలాంటివాడు మనలను రక్షిస్తాడు అని నమ్మడం మేలా? ఎందుకు? 6

1.మీరు చిన్నపిల్లలుగా వున్నపుడు వ్యాధినెపంతో పనిని తప్పించుకొన్న సన్నివేశాలను కొన్నిటిని ఉదాహరించండి. 2.నరులు పగటికలలు ఎందుకు కంటారు? మీరు కనే పగటికలలను కొన్నిటిని పేర్కొనండి. 3.రమణమ్మ శాంతమ్మ అత్తాకోడళ్లు. వాళ్లిద్దరికీ పడదు. రమణమ్మ కొడుకు భార్యనే సమర్ధిస్తాడు. రమణమ్మ కోడలు ముఖం చూడ్డానికి ఇష్టంలేక పొద్దస్తమానమూ ఏదో పనిలో నిమగ్నమై వుంటుంది. ఆమె మనస్తత్వం ఏలాంటిది? 4. సకారణంగా సమస్యను తప్పకోవడానికి అకారణంగా తప్పకో వడానికి భేదం ఏమిటి? 7

1.పుల్లని ద్రాక్షపండ్ల మనస్తత్వం అంటే ఏమిటి? 2.ఆడలేక మద్దెలను తిట్టడం అంటే ఏమిటి?