పుట:Loochupu-fr.Jojayya.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాన్ని సంపాదించి పెట్టేది మరొకటి లేదు - అంటే ఏమిటి? 5. సీత ఏ పనికీ ముందుకురాదు. ఏ పందెంలోను పాల్గొనదు. కాని పోటీల్లో గెల్చి బహుమతులు పొందేవాళ్లను చూచి అసూయచెందు తుంది. ఆ యమ్మాయి మనస్తత్వం మార్చడం ఏలా? 4. 1. మనం ఓ ముఠాగా తిరుగుతూంటాం. ఇతరులను మన ముఠాలోకి రానీయం. ఈలా చేయవచ్చా?

2. రజని ఎప్పడూ క్లాసు మోనిటర్ మీద పోట్లాడుతూంటుంది. ఆ అమ్మాయికి ఏమి సలహా ఇస్తావు?

3. నిజమైన మెప్పకోలికీ పొగడ్డకీ భేదం ఏమిటి? 4.రాణి ఒంటరిగా ఎంతపనైనా చేస్తుంది. కాని ఇతరులతో కలసి పని చేయలేదు. ఆ అమ్మాయికి నీవిచ్చే సలహా యేమిటి?

5. రాజు నాకు స్నేహితులతో అవసరం లేదు. నాయంతట నేను ఒంటరిగా వుండగలను అంటాడు. అతనికి నీవేమి సలహా ఇస్తావు? 6. సీత ఒక్కనిమిషం ఒంటరిగా ఉండదు. ఎప్పడూ ఇతరులతో తిరుగు తూంటుంది. ఇది మంచి పద్ధతేనా? 7. సాంఘికావసరాలను తీర్చుకోవడానికి విద్యార్ధులైన మీకు విద్యాసంస్థల్లో లభించే అవకాశాలను కొన్నిటిని సూచించండి. 5 1.జంకు అనే మానసిక వ్యాధిని జయించే మార్గాలు ఏమిటివి? 2.ప్రకాశం పంతులుకి "ఆంధ్రకేసరి" అనే బిరుదం ఎందుకు వచ్చింది? 3.తగని బెట్టూ, సిగ్గూ - వీటివల్ల ఉన్న అవకాశాలను గూడ పోగొట్టు కొంటాం. మీ జీవితంనుండి కొన్ని ఉదాహరణలు ఈయండి.