పుట:Loochupu-fr.Jojayya.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఆడపిల్లకి వ్యక్తిత్వం ఇచ్చేది అందం. వికృతంగా వుండే అమ్మాయికి ఏమి వ్యక్తిత్వం వుంటుంది?" తప్పా? ఒప్పా? ఎందుకు

2 “శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అంటే యేమిటి? జీవితంలో ఈసూక్తిని ఏలా పాటించగలం? 2.సరస్వతి పుస్తకాలు చదువదు. కబుర్లు చెపుతూంటుంది. పుస్తకాల పురుగును కావడం నాకిష్టం లేదు అంటుంది. ఆ యమ్మాయికి మీరిచ్చే సలహా యేమిటి?

వేణు "మతమనేది చిన్నపిల్లలకీ ముసలివాళ్లకీగాని ప్రాయంలో వున్న వాళ్లకి కాదు" అంటాడు. అతనికి నీవేమి చెప్తావు?

4.పాఠ్యగ్రంథాలు కాక మీరు చదివిన ఇతర పుస్తకాల పేరూ అవి మీపై చూపిన ప్రభావమూ తెలియజేయండి. సరోజకు బోలెడంత పుస్తకజ్ఞానం వుంది. కాని లోకజ్ఞానం లేదు. ఈ లోపాన్ని పూరించుకోవాలంటే ఆ యమ్మాయి ఏం చేయాలి?

1.సరోజ తాను అందమైన అమ్మాయిని కాదనుకొని బాధపడుతూం టుంది. ఆ బాలికను ఏలా ఓదారుస్తావు? 2.నిర్మలను ఇంట్లో పినతల్లి ఆప్యాయంగా చూడదు. ఆ యమ్మాయికి అనురాగవాంఛ ఏలా తీరుతుంది?

3.ఆడవాళ్లు "ఇతరులేమనుకొంటారో" అనే మనస్తత్వానికి సులభంగా లొంగిపోతుంటారు. ఇతరుల మెప్పకోసం ఇష్టంలేని పనులు కూడ చేస్తారు. ఈరంగంలో మీ అనుభవాలు కొన్ని చెప్పండి. 4. Nothing Succeeds like Success – విజయంలాగా విజ