పుట:Loochupu-fr.Jojayya.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశయాలను పెట్టుకోవడమూ వాటిని సాధించడమూ కష్టం. కాని ఆశయాలకోసం కృషిచేసిన సజ్జనులూ, విశేషంగా వాటిని సాధించిన మహానుభావులూ, ప్రపంచంలో చిరస్మరణీయులుగా నిల్చిపోతారు. లోకం వాళ్ల అడుగుజాడల్లో నడవటమే ధన్యమని భావిస్తుంది. కనుక విద్యార్ధులు చిన్ననాటినుండే యీ యూశయాలను అర్ధం చేసికొని కొలదిగానో గొప్పగానో వీటిని సాధించే ప్రయత్నం చేస్తూండాలి. తన పరిస్థితికి తగినట్లుగా ఆశయ సాధనకు పూనుకోని నరునికి గొప్ప వ్యక్తిత్వం లేదనే చెప్పాలి.


ప్రశ్నలు అధ్యాయం – 1

1. సీత "మా చరిత్ర టీచరుకి మంచిపర్సనాలిటీ వుంది” అని చెప్తుంది. ఆ అమ్మాయి ఉద్దేశంలో పర్సనాలిటీ అంటే ఏమిటి?

2. యశోద "నేను పేదపిల్లను. మంచి దుస్తులకూ అలంకరణకూ డబ్బు లేదు. నేను పర్సనాలిటీ ఏలా వృద్ధి చేసికోగలను?" అంటుంది మీ సమాధానం?

3. ప్రయత్నంచేసి కుటుంబ పరిస్థితులకు వ్యతిరేకంగా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోగలమా?

4. ఈ పాఠంలోని ఆరు అంశాలకీ మీకు తెలిసిన మహాపురుషుల జీవితాల నుండి ఉదాహరణలు చూపించండి.

5. "మగపిల్లలూ ఆడపిల్లలూ ఒకే రీతిగా పర్సనాలిటీ అభివృద్ధి చేసికొంటారు” - తప్పా? వొప్పా? ఎందుకు

6. "ఎక్కువ తెలివితేటలు ఉన్నవాళ్లకి యొక్కువ వ్యక్తిత్వం వుంటుంది". తప్పా వొప్పా ఎందుకు?