పుట:Loochupu-fr.Jojayya.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్బుతుంది. సుబ్బలక్ష్మి లతా మంగేష్కర్, రవి శంకర్, సత్యజిత్ రే, రాజా రవివర్మ మొదలయిన కళాకారులు ఎంతోమంది ఈ రంగానికి ఆదర్శంగా వుంటారు.

(6) న్యాయంకోసం పోరాడ్డం. ఇతరుల హక్కుల కోసం పోరాడ్డం, దౌర్జన్యమూ పరపీడనము తొలగించి దిక్కులేనివారికి న్యాయం చేకూర్చి పెట్టడం, అన్యాయాన్ని అరికట్టడం మొదలైన కార్యాలు సమాజానికి ఎంతైనా హితం చేకూర్చిపెడతాయి. అంబేద్కర్ వంటి నిమ్నజాతి నాయకులూ, పాల్కీవాలావంటి న్యాయవాదులూ, ప్రకాశం వంతులు లాంటి స్వాతంత్ర్య సమరయోధులూ ఈ రంగానికి సోదనదివ్వెలు.

(7) ఆదర్శమైన దాంపత్యజీవితం. భార్యాభర్తలు పరస్పరం గౌరవించు కొంటూ ప్రేమించుకొంటూ జీవించడం, భావిదేశపౌరులు కాదగిన చక్కని సంతానాన్ని కనడం, కన్న సంతానాన్ని శీలవంతులూ ప్రయోజకులూ అయ్యేలా పెంచడం మొదలైన బాధ్యతలతో గూడిన పవిత్ర కుటుంబ జీవితాన్ని గూడ ఓ ఆశయంగా పెట్టుకోవచ్చు. మన చుటూ వుండే కుటుంబాల్లో, విశేషంగా పల్లెల్లో, ఈలాంటి ఆదర్శ దంపతులు ఎంతోమంది కన్పిస్తూంటారు.

(8) భగవంతుని సేవకోసం బ్రహ్మచర్యం. వివాహ జీవితం మంచిదే. కాని భగవంతునికీ తోడి ప్రజలకూ పరిచర్య చేసే నిమిత్తం బ్రహ్మచర్యాన్ని అవలంభించడం గూడ యోగ్యమైందే. పురుషులూ స్త్రీలు కూడ ఈలా బ్రహ్మచర్యాన్ని పాటించి తమ జీవితాన్ని ధన్యం చేసికోవచ్చు. ఈలాంటి జీవితాన్ని క్రైస్తవమతంలో గురుజీవితమూ, కన్యాజీవితమూ అంటారు. ఇదే జీవితాన్ని ఇతర మతాల్లో ఇతర నామాలతో పిలుస్తుంటారు. మదర్తెరేసా, రమణ మమర్షి మొదలైన విశుద్ధ వర్తనులు ఎంతోమంది ఈ రంగంలో మణిదీపాల్లా మెరుస్తుంటారు.

ఇంకా ఈలాంటి ఆశయాలు ఎన్నైనా వున్నాయి. కాని వీటన్నిటిలోను ప్రధానాంశం ఒకటుంది. ఆశయాలను పాటించగోరే నరుడు స్వార్గాన్ని వెతుకోకూడదు. పరార్థం కొరకు జీవించాలి. తోడి ప్రజలకు సేవచేయడం నేర్చుకోవాలి. ఇతరులవలన తనకేమి లాభం కలుగుతుందా అనికాక, తన వలన ఇతరులకేమి కాళుజ్ఞ్యడా అని ఆలోచించాలి.