పుట:Loochupu-fr.Jojayya.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటించడం, చురుకుదనంతో ఉల్లాసంగా మెలగడం, శుభ్రంగా వుండడం మొదలైనవి. ఇక శాశ్వతాశయాలు ఒక్క విద్యార్థి దశలోనే గాక జీవితాంతంవరకూ పాటింపవలసినవీ, సాధింపవలసినవీని. ఇవి చాలా వున్నాయి. ఇక్కడ మచ్చునకు కొన్నిటిని మాత్రం పరిశీలిద్దాం. (1) సాంఘిక సేవ. పేదసాదలను ఆదుకొని వాళ్లకు నానా రకాల సేవ చేయడం ఆశయంగా పెట్టుకోవచ్చు. స్వార్ణాన్ని అణచుకొని తోడి ప్రజలకు సేవ చేయాలంటే చాలా వున్నతమైన భావాలు కావాలి. మదర్ తెరేసా, వినోభాబావే మొదలయిన వాళ్లు ఈ రంగంలో స్మరించదగినవాళ్లు. (2) శాస్త్ర పరిశోధనం. మంచి తెలివితేటలు కలవాళ్లు ఆయా శాస్తాలు చదువుకొని వాటిల్లో పరిశోధన చేయగోరుతారు. ప్రపంచానికి విజ్ఞానాన్ని అందీయగోరుతారు. ఐన్స్టయిన్, టాయినీ, రామకృష్ణ గోపాల్ భండార్కర్ మొదలైనవాళ్లు ఈ రంగానికి మార్గదర్శకులు. (3) వినోద కార్యక్రమాలు నడిపించడం. నరుడు దినమంతా పనిచేసి అలసిపోతుంటాడు. అలా బడలిక జెందిన నరుణ్ణి వినోదంతో నవ్వించి మళ్లా అతన్ని తన పనికి పంపగల్గడమనేది ఓ గొప్ప సేవగదా! కనుక ఆటపాటలూ, నవ్వులూ తమాషాలూ మొదలైన వినోద కార్యక్రమాలను నడిపింపగలవాళ్లు ఈ కార్యక్రమాలనే ఓ ఆశయంగా పెట్టుకోవచ్చు. చార్లీ చాప్లిన్ వంటి హాస్యనటులూ, మొక్కపాటి, భమిడిపాటి, మునిమాణిక్యం వంటి హాస్య రచయితలూ ఈ రంగానికి త్రోవ చూపరులుగా వుంటారు. (4) ఇతరులకు తర్ఫీదు ఈయడం. మనం కొన్ని విద్యలూ, కళలూ, పనులూ నేర్చుకొని వాటిని వేరేవాళ్లకు గూడా నేర్చవచ్చు. ఇతరుల జీవితం గూడా సుఖమయమూ సంతోషప్రదమూ చేయవచ్చు. మనం ప్రాథమిక పాఠశాలనుండి కాలేజీలవరకు చూచే మంచి ఉపాధ్యాయులెందరో OJూ రంగంలో దారిదివ్వెల్లాగ వెలిగిపోతూంటారు.

(5)కళాకారులు కావడం. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం వంటి లలిత కళలను సాధించడం గూడ ఓ గొప్ప ఆశయంగా పెట్టుకోవచ్చు. ఈ కళలద్వారా సమాజానికి ఎనలేనినాగరికతా సంస్కృతీ G3D