పుట:Loochupu-fr.Jojayya.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగవాళ్లలో కంటె ఆడవాళ్లలో ఎక్కువ తీవ్రంగా పనిచేసే మనోభావాలు ఏవి? మీ జీవితంలో మీరు ఎప్పుడైనా కోపతాపాలను అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేశారా? ఉదాహరణలు?


11

1."మనకు శక్తిసామర్థ్యాలున్న రంగంలోనే ఆశయాలు పెట్టుకోవాలి" అంటే ఏమిటి? 2.ఆశయసాధనలో పాటించవలసిన మూడు నియమాలు ఏమిటివి? 3.ఆశయాలను ఏలా సాధించాలి? 4.విద్యార్థి దశలో వుండవలసిన తాత్కాలికాశయాలు ఏమిటివి? 5.ఒక్కొక్కరూ వ్యక్తిగతంగా మీకు నచ్చిన శాశ్వతాశయాలను కొన్నింటిని పేర్కొనండి. 6.ఈ పుస్తకంలో పేర్కొనని మహాపురుషులను కొందరిని ఉదాహరించి వాళ్ల ఆశయాలేమిటివో వివరించండి? 7."ఆశయాలు లేనివాళ్లకు జీవితం అర్థవంతంగా వుండదు. ఆశయాలు కలవాళ్లకు జీవించాలనిపిస్తుంది" - వివరించండి. 8.రావు డబ్బు కూడబెటాట్టాలని రేయింబవళ్లు పని చేస్తుంటాడు. శ్యాము తన్ను పెండ్లాడే అందమైన అమ్మాయి కోసం వెదుకు తుంటాడు. వేణు ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించాలని కోరు కొంటాడు. ఇవి ఆశయాలేనా?